Share News

బీజేపీ సీనియర్‌ నేత బల్బీర్‌ పుంజ్‌ కన్నుమూత

ABN , Publish Date - Apr 19 , 2026 | 05:51 AM

బీజేపీ సీనియర్‌ నేత, జర్నలిస్టు, కాలమిస్టు బల్బీర్‌ పుంజ్‌ (77) శనివారం సాయంత్రం కన్నుమూశారు...

బీజేపీ సీనియర్‌ నేత బల్బీర్‌ పుంజ్‌ కన్నుమూత

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18: బీజేపీ సీనియర్‌ నేత, జర్నలిస్టు, కాలమిస్టు బల్బీర్‌ పుంజ్‌ (77) శనివారం సాయంత్రం కన్నుమూశారు. జర్నలిజంతోపాటు రాజకీయాల్లోనూ సుదీర్ఘకాలం పని చేసిన బల్బీర్‌ పుంజ్‌.. రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. 1971లో జర్నలిస్టుగా కెరీర్‌ ప్రారంభించిన బల్బీర్‌ పుంజ్‌.. 1974లో ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో చేరి రెండు దశాబ్ధాల పాటు కొనసాగారు. అబ్జర్వర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా, ఢిల్లీ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. 1996-97లో ఢిల్లీ ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్యుడిగా, జాతీయ యువజన కమిషన్‌ చైర్మన్‌గానూ సేవలందించారు. ఈయన ఆంధ్రజ్యోతి దినపత్రికకు ‘రైట్‌ పాయింట్‌’ శీర్షికన దశాబ్దానికి పైగా కాలమ్‌ రాశారు.

ఈ వార్తలు కూడా చదవండి...

చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్

ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్

Updated Date - Apr 19 , 2026 | 05:51 AM