Share News

జేబుల్లేని వస్త్రాలు.. క్యారెక్టర్‌ సర్టిఫికెట్‌

ABN , Publish Date - Jul 11 , 2026 | 05:47 AM

అయోధ్య రామాలయంలో కానుకల తస్కరణపై దేశవ్యాప్తంగా భక్తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో...

జేబుల్లేని వస్త్రాలు.. క్యారెక్టర్‌ సర్టిఫికెట్‌

  • అయోధ్య రామాలయ హుండీ లెక్కింపు ఉద్యోగులకు కఠిన నిబంధనలు

అయోధ్య/ న్యూఢిల్లీ, జూలై 10 (ఆంధ్రజ్యోతి): అయోధ్య రామాలయంలో కానుకల తస్కరణపై దేశవ్యాప్తంగా భక్తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆలయ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. హుండీ లెక్కింపు విధులు నిర్వహించే ఉద్యోగులకు కఠిన నిబంధనలు విధించింది. ఈ ఉద్యోగులు జేబులు లేని వస్త్రాలు మాత్రమే ధరించి విధులకు హాజరు కావాలని షరతు పెట్టింది. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా పోలీసులు విచారణ జరిపి జారీచేసే క్యారెక్టర్‌ సర్టిఫికేట్‌ సమర్పించాలని ఆదేశించింది. ఉద్యోగి కుటుంబ చరిత్రను పరిశీలించి ఈ సర్టిఫికేట్‌ జారీచేస్తారు. హుండీ లెక్కింపు ప్రదేశంలో కట్టుదిట్టమైన నిఘాతోపాటు అన్ని వైపులా సీసీకెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఈ మేరకు కొత్త రూల్స్‌ జారీచేసింది. కొత్త షరతులు జారీచేయగానే హుండీ లెక్కింపు విధుల్లో ఉన్న 23 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.

Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

Updated Date - Jul 11 , 2026 | 05:47 AM