ఐఏఎఫ్ చీఫ్‌గా అశుతోష్ దీక్షిత్ బాధ్యతలు
ABN , Publish Date - Nov 01 , 2026 | 03:03 AM
భారత వైమానిక దళ(ఐఏఎఫ్) 29వ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఐఏఎఫ్ అధిపతిగా విధుల్లో..
అల్వాల్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): భారత వైమానిక దళ(ఐఏఎఫ్) 29వ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఐఏఎఫ్ అధిపతిగా విధుల్లో ఉన్న అమర్ ప్రీత్ సింగ్ పదవీ విరమణ చేశారు. దాదాపు 20 రకాల యుద్ధ విమానాల (3500కు పైగా వైమానిక గంటలు)ను నడిపిన అనుభవం ఉన్న అశుతోష్ దీక్షిత్.. వైమానిక దళ చీఫ్‌గా 2028 డిసెంబరు 31 వరకూ కొనసాగనున్నారు. కాగా, వైమానిక దళంలో ఏపీ సింగ్ 42 ఏళ్ల పాటు అందించిన సేవలను ఏఐఎఫ్ ఓ ప్రకటనలో కొనియాడింది. ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతగా నిర్వహించడంలో అత్యంత కీలక పాత్ర పోషించారని పేర్కొంది. పదవీ విరమణకు ముందు ఏపీ సింగ్ ఢిల్లీలోని జాతీయ యుద్ధస్మారక స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.