బీజేపీని అడ్డుకోవడం సెక్యులర్ పార్టీల వల్ల కాదు
ABN , Publish Date - May 06 , 2026 | 06:15 AM
దేశంలో బీజేపీని నిలువరించడం సెక్యులర్ పార్టీలకు సాధ్యం అయ్యే పని కాదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు...
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్, మే 5 (ఆంధ్రజ్యోతి): దేశంలో బీజేపీని నిలువరించడం సెక్యులర్ పార్టీలకు సాధ్యం అయ్యే పని కాదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ(ఆప్), మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీలే దీనికి ఉదాహరణ అని గుర్తు చేశారు. మంగళవారం పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన.. బెంగాల్ ప్రజల్లో టీఎంసీ పట్ల వ్యతిరేకత పెరిగిందని అన్నారు. 15 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ.. మాల్దా, ముర్షీదాబాద్ వంటి ప్రాంతాల్లో ముస్లింల వెనకబాటుతనాన్ని తొలగించే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియతో పాటు ప్రభుత్వంలో అవినీతి, ముస్లింలలో వ్యతిరేకత కారణంగా ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోయిందని ఆయన విశ్లేషించారు. బెంగాల్‌లో తాము పోటీచేసిన అన్నిచోట్ల ప్రజలు ఆదరించారని, బలమైన ఓటు బ్యాంకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
గల్ఫ్‌లో తెలుగు యువతి ఆత్మహత్య.. కుటుంబపోషణ కోసం వెళ్లి..
రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు.. తిరుచిరాపల్లిని వదులుకోనున్న విజయ్