ట్రంప్ ఒత్తిడితోనే ఈ-20 పెట్రోల్: కేజ్రీవాల్
ABN , Publish Date - Aug 04 , 2026 | 06:11 AM
ఈ-20 పెట్రోల్ విక్ర యాలపై కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ తన పోరాటాన్ని ఉధృతం చేశారు...
న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఈ-20 పెట్రోల్ విక్ర యాలపై కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ తన పోరాటాన్ని ఉధృతం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడికి లొంగిపోయి... ఆ దేశం నుంచి భారీగా ఇథనాల్‌ను కొనుగోలు చేయడానికి మోదీ ప్రభుత్వం ఒక రహస్య అజెండాను అమలు చేస్తోందని కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ-20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా 2 లక్షల మందికి పైగా ప్రజలు సంతకాలు చేసిన పిటిషన్‌ను ప్రధాని మోదీకి అందజేసేందుకు.. మంగళవారం 100 మంది ప్రతినిధులతో కలిసి ఆయన నివాసానికి మార్చ్ నిర్వహించనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ
బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..