మీ ఎదుట విచారణకు హాజరు కాను
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:59 AM
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం వ్యవహారంలో తాను వ్యక్తిగతంగా కానీ, లాయర్ ద్వారా కానీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట విచారణకు..
నా లాయర్ కూడా వాదనలు వినిపించరు
న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు
రెక్యూసల్ పిటిషన్ తిరస్కరణపై సుప్రీంకెళ్తా
ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంతకు
ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ లేఖ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం వ్యవహారంలో తాను వ్యక్తిగతంగా కానీ, లాయర్ ద్వారా కానీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట విచారణకు హాజరు కాబోనని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం వద్ద విచారణ తటస్థంగా, నిష్పక్షపాతంగా జరుగుతుందని తాను అనుకోవడం లేదన్నారు. అక్కడ న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిస్ స్వర్ణకాంత శర్మకే కేజ్రీవాల్ సోమవారం 4పేజీల లేఖ రాశారు. ఈ విషయాన్ని ఆప్ వెల్లడించింది. కేజ్రీవాల్ కూడా దీనిపై ఎక్స్‌లో వీడియో పోస్టు చేశారు. తాను మహాత్మా గాంధీ చూపించిన సత్యాగ్రహ మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తన రెక్యూసల్ పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ తిరస్కరించడంపై సుప్రీంకోర్టుకు వెళ్తానని తెలిపారు. తన పోరాటం గెలుపు.. ఓటముల గురించి కాదని, ధర్మం.. అధర్మం గురించి అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న నిర్ణయం న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడానికి కాదన్నారు. మద్యం కేసులో జస్టిస్ స్వర్ణకాంత శర్మ జడ్జిగా వద్దని, ఆమె పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందని కేజ్రీవాల్ గతంలో దాఖలు చేసిన రెక్యూసల్ పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ తిరస్కరించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
ఆంధ్ర నెట్ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం