నీట్ లీకేజీపై జెన్‌జీ ఉద్యమించాలి: కేజ్రీవాల్
ABN , Publish Date - May 14 , 2026 | 04:59 AM
ట్ పేపర్ లీకేజీకి కారణమైన వ్యక్తులను న్యాయస్థానం ఎదుట నిలబెట్టాలని, ఈ మేరకు జెన్ జీ ఉద్యమించాలని...
న్యూఢిల్లీ, మే 13: నీట్ పేపర్ లీకేజీకి కారణమైన వ్యక్తులను న్యాయస్థానం ఎదుట నిలబెట్టాలని, ఈ మేరకు జెన్ జీ ఉద్యమించాలని ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్, నేపాల్‌లలో రాజకీయ మార్పులకు జెన్ జీ కారణమవుతోందని, వారి స్ఫూర్తితో భారతీయ యువత కూడా ప్రభుత్వంలో జవాబుదారీతనాన్ని తీసుకువచ్చేలా కృషి చేయలన్నారు. 2014 నుంచీ బీజేపీ పాలనలో అనేక పేపర్ లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నాయని, కోట్లాదిమంది విద్యార్థుల జీవితాలను అవి తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఎన్‌ఎ్‌సయూఐ, ఎస్‌ఎ్‌ఫఐ, యువజన కాంగ్రెస్ తదితర విద్యార్థి, యువజన సంఘాలు దేశంలో పలు చోట్ల బుధవారం నిరసన తెలిపాయి. జరిగిన ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)తో విచారణ జరిపించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షలపై ఉన్న నమ్మకం వమ్ము కాకుండా.. ఎన్‌టీఏకు బదులుగా సాంకేతికంగా ఉన్నతస్థాయిలో ఉండే ఓ స్వతంత్ర సంస్థకు ప్రవేశపరీక్షల బాధ్యతను అప్పగించాలని ‘ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్’ (ఫైమా) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్