ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ విద్యాసాగర్‌కు జాతీయ వాగ్దేవి పురస్కారం
ABN , Publish Date - Jul 30 , 2026 | 06:52 AM
ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్, పెద్దపల్లి జిల్లాకు చెందిన విద్యాసాగర్ వేములకు జాతీ య వాగ్దేవి పురస్కారం లభించింది...
న్యూఢిల్లీ, జూలై 29(ఆంధ్రజ్యోతి): ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్, పెద్దపల్లి జిల్లాకు చెందిన విద్యాసాగర్ వేములకు జాతీయ వాగ్దేవి పురస్కారం లభించింది. ఢిల్లీలోని ఆంధ్ర అసోసియేషన్ భవన్‌లో ‘తెలుగు వెలుగు సంబరాలు’ పేరిట డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జర్నలిజంలో ప్రతిభ చూపించిన ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి విద్యాసాగర్ వేములకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ‘జాతీయ వాగ్దేవి పురస్కారాన్ని’ ప్రదానం చేసి సత్కరించారు. అలాగే, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి కూడా ఈ పురస్కారాలను అందించారు.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్
ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్