సర్జరీ చేయించుకున్న అమితాబ్.. వైరల్‌గా మారిన ఎమోషనల్ పోస్ట్..
ABN , Publish Date - Jul 21 , 2026 | 04:01 PM
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొద్దిరోజుల క్రితం సర్జరీ చేయించుకున్నారు. నిన్న (సోమవారం) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ పోస్టులో చెప్పుకొచ్చారు.
ఇంటర్‌నెట్ డెస్క్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొద్దిరోజుల క్రితం సర్జరీ చేయించుకున్నారు. నిన్న (సోమవారం) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ పోస్టులో చెప్పుకొచ్చారు. సోమవారం రాత్రి పెట్టిన ఆ పోస్టులో అమితాబ్ తన సర్జరీ జర్నీ గురించి చెబుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
అమితాబ్ తన పోస్టులో.. ‘సర్జరీ.. ఐసీయూలో నిపుణులైన డాక్టర్లు, వైద్య సిబ్బంది పర్యవేక్షణ.. ఆ తర్వాత డిశ్చార్జ్.. ఇంటికి చేరుకోవడం. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కోలుకునే ప్రక్రియ అత్యంత కష్టమైనది. శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి. మీరొక గొప్ప విజేతగా నిలిచినా.. ఏదో ఒకరోజు ఓటమి మిమ్మల్ని పలకరిస్తుంది. ఇది జీవితంలోనే అత్యంత కష్టమైన సమయం. కొందరు దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు. మరికొందరు లొంగిపోతారు. అందరూ ఆరోగ్యంగా.. సంతోషంగా ఉండాలి’ అని రాసుకొచ్చారు.
అయితే, తను ఎందుకు సర్జరీ చేయించుకున్నారో మాత్రం అమితాబ్ చెప్పలేదు. అమితాబ్ పెట్టిన ఆ బ్లాగ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమితాబ్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమితాబ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అప్పుడు రోహిత్ శర్మ చెప్పిన మాటలు నమ్మలేదు: సంజు శాంసన్