Share News

సర్‌పై పార్లమెంటు లోపల చర్చిద్దాం: అమిత్‌ షా

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:07 AM

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై పార్లమెంటు లోపల చర్చిద్దామని, అందుకోసం ప్రత్యేక సమావేశాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రహోంమంత్రి అమిత్‌షా అన్నారు.

సర్‌పై పార్లమెంటు లోపల చర్చిద్దాం: అమిత్‌ షా
amithshah

కర్నాల్‌, నవంబరు 5: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై పార్లమెంటు లోపల చర్చిద్దామని, అందుకోసం ప్రత్యేక సమావేశాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రహోంమంత్రి అమిత్‌షా అన్నారు. హరియాణాలోని కర్నాల్‌లో గురువారం నిర్వహించిన ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి- అరాచకాన్ని అంతం చేయండి’ ర్యాలీలో షా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో చర్చలకు పార్లమెంటే అత్యున్నత వేదిక అని పేర్కొ న్నారు. అటువంటి సభలో గందరగోళం సృష్టించడం, చర్చలను బహిష్కరించడమే కాంగ్రెస్‌ సంస్కృతిగా ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ మార్చివేశారని విమర్శించారు. చొరబాటుదారులను రక్షించాలని ఇండియా కూటమి చూస్తోందని, కానీ అలాంటి వారిని గుర్తించి ఓటరు జాబితా నుంచి తొలగించడమే బీజేపీ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - Nov 06 , 2026 | 06:34 AM