ఆమ్కా నమూనాల తయారీ కోసం టాటా, ఎల్ అండ్ టీ, భారత్ ఫోర్జ్ ఎంపిక
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:05 AM
భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్.. అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రా్‌ఫ్ట(ఆమ్కా) ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. ఏఎంసీఏ నమూనాల...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్.. అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రా్‌ఫ్ట(ఆమ్కా) ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. ఏఎంసీఏ నమూనాల తయారీ కోసం టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, ఎల్‌అండ్‌టీ-బెల్ కన్సార్టియం, భారత్ ఫోర్జ్ నేతృత్వంలోని బీఈఎంఎల్, డేటా ప్యాటర్న్స్‌తో కూడిన సంస్థలను డీఆర్‌డీవో షార్ట్ లిస్ట్ చేసింది. స్వదేశీ ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్‌ను అభివృద్ధి చేయడం ఏఎంసీఏ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. 2028 నాటికి మొదటి ప్రొటోటై్‌పను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఏఎంసీఏ ప్రాజెక్టులో భాగంగా 125 ఫైటర్ జెట్లను తయారు చేయాలని, 2035 నాటికి వాటిని వైమానిక దళంలోకి ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవేళ ఇది సాకారమైతే ఐదవ తరం యుద్ధ విమానాలు తయారు చేస్తున్న అమెరికా (ఎఫ్-22, ఎఫ్-35), చైనా (జే-20), రష్యా (సుఖోయ్-57) సరసన భారత్ కూడా చేరనుంది.
ఇవి కూడా చదవండి..
ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ హైట్స్‌కు వెళ్లే హెలికాప్టర్ల తయారీ.. మోదీ