కరిగిపోయిన అమర్‌నాథ్ మంచు లింగం!
ABN , Publish Date - Jul 11 , 2026 | 06:02 AM
అమర్‌నాథ్ మంచు లింగం శరవేగంగా కరిగిపోతోంది. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన తొలి ఐదు రోజుల్లోనే 90 శాతానికి పైగా...
న్యూఢిల్లీ, జూలై 10: అమర్‌నాథ్ మంచు లింగం శరవేగంగా కరిగిపోతోంది. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన తొలి ఐదు రోజుల్లోనే 90 శాతానికి పైగా లింగం కరిగిపోవడంపై భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తున్నారు. మొత్తం 57 రోజులు సాగాల్సిన యాత్ర తొలివారంలోనే మంచు లింగం దాదాపుగా అదృశ్యం అవుతుండటంతో వారంతా తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన తొలి నాలుగు రోజుల్లోనే 93 వేల మందికి పైగా గుహను సందర్శించారు. ఒక్క రెండో రోజునే 20వేల మందికి పైగా వచ్చారు. వాతావరణ మార్పులు, అమర్‌నాథ్ గుహకు సమీపంలో భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన కోసం చేస్తున్న ఏర్పాట్లు, భారీ యంత్రాల వాడకం వాతావరణం వేడెక్కి శివలింగం కరిగిపోవడానికి కారణమవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్