Share News

తాజ్ మహల్ వివాదం.. కేంద్రం, ఏఎస్ఐకు హైకోర్టు నోటీసులు..

ABN , Publish Date - Jul 06 , 2026 | 04:24 PM

తాజ్ మహల్ వివాదానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 'తేజో మహాలయ' పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కు నోటీసులు జారీ చేసింది.

తాజ్ మహల్ వివాదం.. కేంద్రం, ఏఎస్ఐకు హైకోర్టు నోటీసులు..
Taj Mahal Issue

ఉత్తర్‌ప్రదేశ్: తాజ్ మహల్ వివాదానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 'తేజో మహాలయ' పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నాలుగో ప్రతివాది పంకజ్ కుమార్ వర్మకూ నోటీసులు పంపింది.


తాజ్ మహల్ ప్రాంగణంలో శివాలయం ఉందని పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. 'అగ్రేశ్వర్ మహాదేవ్ నాగనాథేశ్వర్ తేజో మహాలయ' ఆలయానికి సంబంధించిన అంశంపై హిందూ పక్షం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో తాజ్ మహల్ లోపల సర్వే నిర్వహించేందుకు, ఫొటోగ్రఫీకి అనుమతి ఇవ్వాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఇంతకుముందు ఇదే కేసులో సర్వే నిర్వహించాలన్న విజ్ఞప్తిని ఆగ్రా జిల్లా కోర్టు తిరస్కరించింది. దీంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ న్యాయవాది హరి శంకర్ జైన్.. అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, ఏఎస్ఐ నుంచి వివరణ కోరింది. కేంద్ర ప్రభుత్వం, ఏఎస్ఐ దాఖలు చేసే కౌంటర్ అఫిడవిట్ల ఆధారంగా తాజ్ మహల్‌లో సర్వేకు అనుమతి ఇవ్వాలా? లేదా? అనే అంశంపై అలహాబాద్ హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది.


ఈ వార్తలు కూడా చదవండి

హర్యానాలో దారుణ ఘటన.. భార్యను ప్రియురాలి ఇంటికి తీసుకెళ్లి..

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఇద్దరి మృతి, ఒకరి గల్లంతు..

Updated Date - Jul 06 , 2026 | 06:14 PM