అజిత్ పవార్ మరణం.. విమానం గురించి ఈ విషయాలు తెలుసా?
ABN , Publish Date - Jan 28 , 2026 | 02:40 PM
కెనడాకు చెందిన బాంబార్డియర్ సంస్థ లియర్‌జెట్ 45XR విమానాలను తయారు చేసింది. 47 అడుగుల వింగ్ స్పాన్‌తో.. 9,752 కిలోల బరువుతో ఉండే ఈ విమానాలు అత్యంత వేగంగా గమ్య స్థానాన్ని చేరుకోగలవు.
ముంబై, జనవరి 28: ఈ రోజు (బుధవారం) ఉదయం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న లియర్‌జెట్ 45XR విమానం బారామతిలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు మృత్యువాతపడ్డారు. విమానం ముంబై నుంచి బారామతి వెళుతుండగా ఉదయం 8.45 గంటల ప్రాంతంలో ఊహించని విధంగా కుప్పకూలిపోయింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీసీజీఏ) చెబుతోంది.
లియర్‌జెట్ 45XR గురించి ఆసక్తికర విషయాలు..
కెనడాకు చెందిన బాంబార్డియర్ సంస్థ లియర్‌జెట్ 45XR విమానాలను తయారు చేసింది. ఇవి అధునాతన బిజినెస్ జెట్ విమానాలు. 47 అడుగుల వింగ్ స్పాన్‌తో.. 9,752 కిలోల బరువుతో ఉండే ఈ విమానాలు అత్యంత వేగంగా గమ్య స్థానాన్ని చేరుకోగలవు. చిన్న రన్‌వేలలో కూడా టేకాఫ్, ల్యాండింగ్ చేయగల సామర్థ్యం వీటి సొంతం. గరిష్టంగా 8–9 మంది ప్రయాణికులు ప్రయాణించేలా లియర్‌జెట్ 45XR విమానాలను తయారు చేశారు. సుమారు 2,000 నుంచి 2,235 కిలోమీటర్ల దూరం వరకు నాన్‌స్టాప్‌గా ప్రయాణించగలవు.
వేగం, సౌకర్యం కారణంగా లియర్‌జెట్ 45XR ను వీఐపీ ప్రయాణాలు, చార్టర్ ఫ్లైట్లు, కార్పొరేట్ అవసరాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 2003 నుంచి 2012 వరకు బాంబార్డియర్ సంస్థ వీటిని తయారు చేసింది. 2012 తర్వాత తయారీ నిలిచిపోయింది. ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ మార్కెట్ మాత్రమే ఇవి అమ్మకానికి ఉంటున్నాయి. బారామతిలో కుప్పకూలిన లియర్‌జెట్ 45XR విమానం వీఎస్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందినది. విమానాలను అద్దెకు ఇచ్చే అతి పెద్ద సంస్థలలో వీఎస్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఒకటి.
ఇవి కూడా చదవండి
డబ్ల్యూపీఎల్-202: జెమీమా రోడ్రిగ్స్‌కు బిగ్ షాక్
అజిత్ పవార్ మృతిలో కుట్రకోణం... మమత సంచలన వ్యాఖ్యలు