అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో వారానికి 100కిపైగా కోత!
ABN , Publish Date - May 14 , 2026 | 05:25 AM
పెరుగుతున్న విమాన ఇంధన ధరలు, అంతర్జాతీయంగా కొన్ని ప్రాంతాల్లో గగనతల ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది...
వారానికి 100కిపైగా కోత!
7 విదేశీ మార్గాల్లో సేవల నిలిపివేత
జూన్ నుంచి అమలు : ఎయిరిండియా
న్యూఢిల్లీ, మే 13: పెరుగుతున్న విమాన ఇంధన ధరలు, అంతర్జాతీయంగా కొన్ని ప్రాంతాల్లో గగనతల ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు వారానికి 100కి పైగా విదేశీ విమాన సర్వీసులను తగ్గించడంతో పాటు 7 అంతర్జాతీయ మార్గాల్లో సేవలను తాత్కాలికంగా నిలిపేయనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇప్పటికే కొన్ని మార్గాల్లో సర్వీసులను తగ్గించుకున్న ఎయిరిండియా.. తాజా నిర్ణయాన్ని వచ్చే నెల నుంచి ఆగస్టు వరకు 3 నెలల పాటు అమలు చేయనుంది. ఈమేరకు ఢిల్లీ-షికాగో, ఢిల్లీ-నెవార్క్, ముంబై-న్యూయార్క్, ఢిల్లీ-షాంఘై, చెన్నై-సింగపూర్, ముంబై-ఢాకా, ఢిల్లీ-మాలేకు తాత్కాలికంగా సేవలను నిలిపేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్