Share News

కిడ్నీ వ్యాధుల్ని ముందే గుర్తించే 3 ఏఐ టూల్స్‌

ABN , Publish Date - Sep 04 , 2026 | 06:38 AM

కిడ్నీ వ్యాధులను తొలిదశలోనే గుర్తించే మూడు ఏఐ టూల్స్‌ను ఐఐటీ మద్రాస్‌, వెల్లూర్‌లోని సుప్రసిద్ధ క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌ (సీఎంసీ) పరిశోధకులు అభివృద్ధి చేశారు.

కిడ్నీ వ్యాధుల్ని ముందే గుర్తించే 3 ఏఐ టూల్స్‌

  • అభివృద్ధి చేసిన ఐఐటీ మద్రాస్‌, సీఎంసీ వెల్లూర్‌ పరిశోధకులు

చెన్నై, సెప్టెంబరు 3: కిడ్నీ వ్యాధులను తొలిదశలోనే గుర్తించే మూడు ఏఐ టూల్స్‌ను ఐఐటీ మద్రాస్‌, వెల్లూర్‌లోని సుప్రసిద్ధ క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌ (సీఎంసీ) పరిశోధకులు అభివృద్ధి చేశారు. వాటిలో ఒకటి.. సీకేడీ రిస్క్‌ ప్రెడిక్షన్‌ మోడల్‌. ఇది.. వైద్య పరీక్షల నివేదికలను విశ్లేషించి ఒక వ్యక్తికి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వచ్చేదీ లేనిదీ ముందే అంచనా వేస్తుంది. రెండోది సీటీ స్కాన్‌ క్లాసిఫయర్‌. ఇది సీటీ స్కాన్లను విశ్లేషించి.. అంతా బాగుంటే.. సాధారణ కిడ్నీ అని చెబుతుంది. కణితులంటే కిడ్నీ ట్యూమర్‌ అని, రాళ్లుంటే కిడ్నీ స్టోన్‌ అని, సిస్ట్‌లు ఉంటే కిడ్నీ సిస్ట్‌ అని చెబుతుంది. ఇక మూడోది.. సీటీ స్కాన్లను త్రీడీ మోడళ్లుగా మార్చే ఇమేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌. కిడ్నీలో ఏవైనా కణితులు ఉంటే.. వాటిని కచ్చితంగా కొలవడానికి ఉపయోగపడే టూల్‌ ఇది. వీటి సాయంతో కిడ్నీ సమస్యలను తొలి దశల్లోనే గుర్తించవచ్చని ఐఐటీ ప్రొఫెసర్‌ శామ్యూల్‌ తెలిపారు.

Updated Date - Sep 04 , 2026 | 06:40 AM