ప్రతి పౌరుడికీ ఏఐ: పెమ్మసాని
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:21 AM
దేశంలోని ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ కనెక్టవిటీ ఉండేలా చేసి, ప్రతి పౌరుడు కృత్రిమ మేధ(ఏఐ) వినియోగించుకునేలా చేయడమే...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): దేశంలోని ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ కనెక్టవిటీ ఉండేలా చేసి, ప్రతి పౌరుడు కృత్రిమ మేధ(ఏఐ) వినియోగించుకునేలా చేయడమే భారత ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఏఐ ఆధారిత భారత్ నిర్మాణానికి సాంకేతిక అనుసంధానత(డిజిటల్ కనెక్టివిటీ)నే ప్రధాన మౌలిక సదుపాయమని తెలిపారు. 2014లో 6 కోట్ల మంది ఉన్న బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు, 2025 నాటికి 100 కోట్లకు చేరడం దేశ డిజిటల్ ప్రగతికి నిదర్శనమని చెప్పారు. ఇండియా ఏఐ మిషన్ కోసం ప్రభుత్వం రూ. 10,372 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ హైట్స్‌కు వెళ్లే హెలికాప్టర్ల తయారీ.. మోదీ