Share News

ఉద్యోగాల్లో అగ్నివీర్‌లకు 20 శాతం రిజర్వేషన్‌

ABN , Publish Date - Mar 26 , 2026 | 06:20 AM

ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అగ్నివీర్‌లకు 20 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సిఫారసు చేసింది...

ఉద్యోగాల్లో అగ్నివీర్‌లకు 20 శాతం రిజర్వేషన్‌

  • రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ

న్యూఢిల్లీ, మార్చి 25: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అగ్నివీర్‌లకు 20 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సిఫారసు చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. అటవీ గార్డులు, మైనింగ్‌ గార్డులు, పోలీసు కానిస్టేబుల్‌, అగ్నిమాపక సిబ్బంది, జైలు వార్డెన్‌, స్పెషల్‌ పోలీసు ఆఫీసర్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ తదితర నియామకాల్లో ఈ రిజర్వేషన్‌ అమలు చేయాలని ఆ లేఖలో సూచించారు. అగ్నివీర్‌ తొలి బ్యాచ్‌లో చేరిన వారు 2027లో తమ నాలుగేళ్ల సర్వీసును పూర్తి చేసుకోనున్నారు. అయితే, పోలీసు, మైనింగ్‌ గార్డులు, జైలు వార్డెన్‌, స్పెషల్‌ పోలీసు ఆఫీసర్‌, గ్రూప్‌-సీ నియామకాల్లో అగ్నివీర్‌లకు 20ు రిజర్వేషన్‌ అమలు చేస్తామని మొదట హరియాణా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!

ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్

Updated Date - Mar 26 , 2026 | 06:20 AM