నా స్కాలర్‌షిప్ వివరాలు వెల్లడిస్తా..
ABN , Publish Date - Aug 04 , 2026 | 05:28 AM
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అమెరికా చదువుకు డబ్బులెక్కడి నుంచి వచ్చాయో విచారించాలన్న ఆర్‌టీఐ కార్యకర్త అమిత్...
మోదీ తన డిగ్రీ బయటపెడతారా?
ప్రధాని మోదీకి అభిజిత్ దీప్కే సవాలు
బీజేపీ నాయకులు కూడా వారి విద్యార్హతలను
బహిర్గతం చేయాలని డిమాండ్
న్యూఢిల్లీ, ఆగస్టు 3: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అమెరికా చదువుకు డబ్బులెక్కడి నుంచి వచ్చాయో విచారించాలన్న ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీకి దీప్కే కౌంటర్ ఇచ్చారు. ‘నా విద్యకు సంబంధించిన స్కాలర్‌షిప్, లోన్ వివరాలన్నీ వెల్లడిస్తా.. మరి చక్రవర్తి, మీ నాయకుడు (మోదీ) తనకున్న అసలైన డిగ్రీ పట్టాను బయటపెడతారా?’ అని ఆయన ప్రశ్నించారు. అలాగే బీజేపీ నాయకులు కూడా వారి వారి విద్యార్హతలను బహిర్గతం చేయలంటూ దీప్కే సోమవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఓ మామూలు యువకుడు అమెరికాలో చదువుకుంటే వీరంతా బాధ పడుతున్నారని విమర్శించారు. అన్ని అనుమానాలూ తీరడానికి తన ఎడ్యుకేషన్ లోన్ వివరాలు తెలియజేస్తానని, ప్రధాని నిజమైన డిగ్రీ చూపించాలని సవాలు విసిరారు.
ఇవి కూడా చదవండి..
విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ
బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..