ప్లీజ్ దీక్ష విరమించండి.. సోనమ్ వాంగ్‌చుక్‌కు సీజేపీ అధినేత రిక్వెస్ట్..
ABN , Publish Date - Jul 22 , 2026 | 04:43 PM
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజీత్ దీప్కే విజ్ఞప్తి చేశారు. దేశానికి వాంగ్‌చుక్ అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, జులై 22: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజీత్ దీప్కే విజ్ఞప్తి చేశారు. దేశానికి వాంగ్‌చుక్ అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం దీప్కే తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షను విరమించాలని కోరుతున్నాము. దేశానికి ఆయన అవసరం ఉంది. ఆయన ప్రాణం చాలా విలువైనది. దాన్ని మరింత ప్రమాదంలో పడేయకూడదు. డిమాండ్లు నెరవేరే వరకు జంతర్‌మంతర్ వద్ద శాంతియుత నిరసనలు కొనసాగుతాయి’ అని రాసుకొచ్చారు.
కొనసాగుతున్న వాంగ్‌చుక్ దీక్ష..
సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించటంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు కొద్దిరోజుల క్రితం జంతర్ మంతర్ వద్ద నుంచి ఆయననను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. మొదట సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం వాంగ్‌చుక్‌ను గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి మార్చారు. ఆయన అక్కడి ఐసీయూలో ఉంటూనే.. డాక్టర్ల బలవంతపు ఫీడింగ్‌ను నిరాకరిస్తూ దీక్షను కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మహిళలకు ఆర్మీ ఛాన్స్.. రూ.56 వేల స్టైపెండ్‌తో ఉద్యోగాలు
పిక్‌యాక్స్ అణుకేంద్రంపై దాడి చేస్తామన్న యూఎస్! ఇది సాధ్యమేనా?