ఫ్రెండ్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. ఇంత దారుణంగా మోసం చేస్తారనుకోలేదు..
ABN , Publish Date - Aug 05 , 2026 | 09:15 AM
స్నేహితులను గుడ్డిగా నమ్మిన ఓ వ్యక్తి దారుణంగా మోసపోయాడు. స్నేహితుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన గుజరాత్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.
సూరత్, ఆగస్టు 5: స్నేహితులను గుడ్డిగా నమ్మిన ఓ వ్యక్తి దారుణంగా మోసపోయాడు. స్నేహితుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన గుజరాత్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జునాగధ్ జిల్లాలోని మోనియా గ్రామానికి చెందిన రాజేశ్‌భాయ్ అనే వ్యక్తి భార్య భవికాబెన్ ఇద్దరు పిల్లలతో కలిసి సూరత్‌లో సెటిల్ అయ్యాడు. అతడు ఎంబ్రాయిడరీ బిజినెస్ చేస్తున్నారు. ఆ బిజినెస్‌లో నష్టాలు రావటంతో తీవ్ర అప్పుల పాలయ్యాడు. ఈ నేపథ్యంలోనే రాజేశ్ ఎంబ్రాయిడరీ మిషిన్స్‌ను అమ్మేశాడు.
తద్వారా వచ్చిన 14 లక్షల రూపాయలతో అప్పులు కట్టుకోవాలని అనుకున్నాడు. అయితే, అతడి స్నేహితుడు ఘన్‌శ్యామ్ అహిర్ కెనడా వెళ్లటం కోసం డబ్బులు కావాలని అడగటంతో.. తన దగ్గర ఉన్న 14 లక్షల రూపాయలు ఇచ్చేశాడు. చెప్పిన సమయానికి డబ్బులు తిరిగిస్తానన్న ఘన్‌శ్యామ్ మాట తప్పాడు. డబ్బులు తిరిగివ్వమని రాజేశ్.. ఘన్‌శ్యామ్‌ను అడిగాడు. అతడు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా.. రాజేశ్ పేరు మీద కొత్తగా ఆరు బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేయించాడు. ఆర్థిక లావాదేవీల కోసం వాటిని వాడతానని చెప్పాడు.
కొద్దిరోజుల తర్వాత అసలు విషయం బయటపడింది. ఘన్‌శ్యామ్ ఆ బ్యాంక్ అకౌంట్లను సైబర్ నేరాల కోసం వాడుతున్నాడని తెలిసి రాజేశ్ షాక్ అయ్యాడు. ఆగ్రహానికి గురైన రాజేశ్ తప్పుడు పనులు చేయవద్దని ఘన్‌శ్యామ్‌ను హెచ్చరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఘన్‌శ్యామ్.. రాజేశ్‌పై బెదిరింపులకు దిగాడు. ‘నువ్వు సైబర్ నేరాలు చేస్తున్నావని పోలీసులకు చెబుతా’ అంటూ భయపెట్టసాగాడు. రాజేశ్.. ఘన్‌శ్యామ్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులకు కూడా డబ్బులు ఇచ్చాడు. నిఖిత్ అనే వ్యక్తి రెండు లక్షల రూపాయలు.. దాధి అహిర్‌కు 1.32 లక్షల రూపాయలు ఇచ్చాడు.
వారు డబ్బులు తిరిగివ్వకపోగా.. మానసికంగా రాజేశ్‌ను వేధింపులకు గురి చేయటం మొదలెట్టారు. ‘నీ దగ్గర డబ్బులు లేకపోతే చావు’ అంటూ వేధించసాగారు. రోజు, రోజుకు వారి టార్చర్ ఎక్కువవటంతో రాజేశ్ తట్టుకోలేకపోయాడు. సూసైడ్ నోట్‌లో ముగ్గురి గురించి రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ నోట్ ఆధారంగా ముగ్గురినీ ప్రెండ్షిప్ డే రోజున అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
ట్రంప్ గోల్ఫ్ కోర్స్ వద్ద సాయుధుడి అరెస్టు
చివరి బంతికి ఒక్క పరుగు.. ఈ మిస్‌ఫీల్డ్ క్రేజీ రనౌట్‌ను చూడాల్సిందే!