హోర్ముజ్‌ను దాటిన 8 భారత నౌకలు
ABN , Publish Date - Apr 05 , 2026 | 06:41 AM
హోర్ముజ్‌పై ఇరాన్ నియంత్రణ కొనసాగుతున్నప్పటికీ ఎనిమిది భారత నౌకలు ఈ జలసంధిని విజయవంతంగా దాటాయి. శనివారం ఉదయం ఎనిమిదవదైన ‘గ్రీన్ సాన్వి’ ఎల్‌పీజీ ట్యాంకర్...
ప్రపంచ దేశాల నౌకల్లో ఇదే పెద్ద సంఖ్య
మన నౌకలు చైనాకు వెళ్తున్నాయన్న ప్రచారంలో వాస్తవం లేదు: కేంద్రం
గ్యాస్ ప్యానిక్ బుకింగ్‌లు వద్దని సూచన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: హోర్ముజ్‌పై ఇరాన్ నియంత్రణ కొనసాగుతున్నప్పటికీ ఎనిమిది భారత నౌకలు ఈ జలసంధిని విజయవంతంగా దాటాయి. శనివారం ఉదయం ఎనిమిదవదైన ‘గ్రీన్ సాన్వి’ ఎల్‌పీజీ ట్యాంకర్ సైతం జలసంధిని దాటుకుని భారత్ దిశగా పయనిస్తోంది. మరో రెండు నౌకలు గ్రీన్ ఆశా, జగ్ విక్రమ్‌లు కూడా కొద్దిరోజుల్లోనే స్వదేశానికి రానున్నాయి. ఇప్పటి వరకు శివాలిక్, నందాదేవి, జగ్ లడ్కీ, పైన్ గ్యాస్, జగ్ వసంత్, బీడబ్ల్యూ టైర్, బీడబ్ల్యూ ఎల్మ్, గ్రీన్ సాన్వి హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటాయి. ఇదేసమయంలో 485 మంది నావికులతో కూడిన 15 నౌకలు గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఉండిపోయాయి. భారత్‌కు చెందిన 46,650 టన్నుల ఎల్‌పీజీ ట్యాంకర్‌తో ‘గ్రీన్ సాన్వి’ హోర్ముజ్‌ను దాటడంపై గుజరాత్ ఉపముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఇది భారత దౌత్య విజయమని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఇరాన్.. ‘‘మన ఉమ్మడి చరిత్రలో భారత్‌కు, గుజరాత్‌కు ప్రత్యేక స్థానం ఉంది.’’ అని పేర్కొంది. మరోవైపు.. ఇరాన్ క్రూడాయిల్ నౌకలకు భారత్ సొమ్ములు చెల్లించకపోవడంతో ఆ నౌకలు చైనాకు మళ్లిపోతున్నాయన్న వార్తలను కేంద్ర పెట్రోలియం శాఖ ఖండించింది. భారత రిఫైనరీలు తగినంత క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకున్నాయని.. వాటికి సంబంధించిన సొమ్ములు సైతం చెల్లించాయని తెలిపింది. భారత్‌కు రావాల్సిన నౌకలు చైనాకు మళ్లుతున్నాయన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. దేశంలో పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని, ప్రజలు గ్యాస్ దొరకదేమోనన్న భయంతో ముందే బుకింగ్ (పానిక్ బుకింగ్)చేయవద్దని సూచించింది.
ఇవి కూడా చదవండి
శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం
‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే... జరిగింది!