Share News

రసాయన ఫ్యాక్టరీలో పేలుడు..ఏడుగురి మృతి

ABN , Publish Date - Feb 17 , 2026 | 06:02 AM

రాజస్థాన్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భివాడి పట్టణంలోని ఓ రసాయన కర్మాగారంలో భారీ పేలుడు సంభవించడంతో ఏడుగురు కార్మికులు సజీవ...

రసాయన ఫ్యాక్టరీలో పేలుడు..ఏడుగురి మృతి

భివాడి, ఫిబ్రవరి 16: రాజస్థాన్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భివాడి పట్టణంలోని ఓ రసాయన కర్మాగారంలో భారీ పేలుడు సంభవించడంతో ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. ఖుష్ఖేరా-కరోలి పారిశ్రామిక ప్రాంతంలోని దుస్తుల కర్మాగారంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. అయితే, దుస్తుల కర్మాగారం పేరుతో నడుస్తున్న ఈ భవనంలో అక్రమంగా బాణసంచా తయారుచేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 20 మందికి పైగా కార్మికులు ఉన్నట్లు సమాచారం. పేలుడు సంభవించగానే చాలామంది బయటకు పరుగులు తీసినప్పటికీ, తొమ్మిది మంది లోపలే ఉండిపోయారు. వీరిలో ఏడుగురు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

ఇవి కూడా చదవండి..

దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 17 , 2026 | 06:02 AM