డెలివరీ బాయ్‌పై కత్తితో దాడి.. వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన యువకులు
ABN , Publish Date - Jan 20 , 2026 | 09:28 PM
తమిళనాడులోని వేళచ్చేరికి చెందిన 23 ఏళ్ల పార్తిబన్ అనే యువకుడు ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. గత సంవత్సరం దీపావళి రోజున అతడికి స్థానికంగా ఉండే ఓ ముగ్గురు యువకులతో గొడవైంది.
తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది యువకులు ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌పై కత్తితో దాడి చేశారు. ఈ దాడిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. వేళచ్చేరికి చెందిన 23 ఏళ్ల పార్తిబన్ అనే యువకుడు ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. గత సంవత్సరం దీపావళి రోజున అతడికి స్థానికంగా ఉండే ఓ ముగ్గురు యువకులతో గొడవైంది. ఆ ముగ్గురూ పార్తిబన్‌పై కక్ష పెంచుకున్నారు. జనవరి 18వ తేదీన అతడు ఏఎల్ ముదలి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఓ ఇద్దరు యువకులు బైకుల మీద అతడి దగ్గరకు వచ్చారు.
తర్వాత పదునైన ఆయుధాలతో అతడిపై దాడి చేశారు. ఆ దాడి నుంచి తప్పించుకోవడానికి పార్తిబన్ పరుగులు పెట్టాడు. అయినా కూడా వారు వదల్లేదు. పరిగెత్తించి మరీ కత్తితో దాడి చేశారు. అతడు రక్తపు మడుగులో పడి ఉన్నా కూడా వారు అతడ్ని వదిలిపెట్టలేదు. దాడి చేస్తూనే ఉన్నారు. దీంతో స్థానికులు రంగంలోకి దిగారు. రాళ్లు, కర్రలతో వారిపై దాడి చేశారు. దీంతో భయపడిపోయిన వారు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు వెంటనే పార్తిబన్‌ను రాయపేట హాస్పిటల్‌కు తరలించారు. డాక్టర్లు అత్యవసర వైద్యం అందిస్తూ ఉన్నారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులు దాడికి సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారని తెలిపారు. పాత కక్షల కారణంగానే ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అన్నారు. పార్తిబన్ తల, చేతులు, పొట్టపై తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
స్విట్జర్లాండ్‌లో ట్రంప్ విందు.. ఏడుగురు భారతీయ సీఈవోలకు ఆహ్వానం..
మీ మెదడుకు మేత.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 29 సెకెన్లలో కనిపెట్టండి