హత్య కేసులో 21 మంది ఆరెస్సెస్ కార్యకర్తలకు విముక్తి
ABN , Publish Date - Oct 18 , 2026 | 05:17 AM
హత్య కేసులో 21మంది ఆరెస్సెస్-బీజేపీ కార్యకర్తలకు విముక్తి కలిగిస్తూ కాసర్గోడ్ అదనపుజిల్లా, సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది.
కాసర్గోడ్, అక్టోబరు 17: హత్య కేసులో 21మంది ఆరెస్సెస్-బీజేపీ కార్యకర్తలకు విముక్తి కలిగిస్తూ కాసర్గోడ్ అదనపుజిల్లా, సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితులపై ఉన్న ఆరోపణలను ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోవడమే కారణమని తెలిపింది. 2014 డిసెంబరులో ఎస్డీపీఐ కార్యకర్త జైనుల్ అబిద్(26)ను ఆయన తండ్రిముందే హత్య చేశారంటూ వారిపై కేసు నమోదయింది. అయితే ప్రధాన సాక్షిగా ఉన్న జైనుల్ తండ్రి విచారణ ప్రారంభం కాకముందే 2024లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరణించిన వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం చెల్లదని కోర్టు పేర్కొంటూ కేసును కొట్టివేసింది.