కలుషిత నీటితో 15 రోజుల్లో 12 మరణాలు
ABN , Publish Date - Feb 17 , 2026 | 06:05 AM
హరియాణాలోని పాల్వాల్ జిల్లా చాయన్సా గ్రామంలో కలుషిత తాగునీటి కారణంగా అంటువ్యాధులు వ్యాప్తిచెందుతుండడం కలకలం రేపుతోంది. గత 15 రోజుల్లో ఐదుగురు...
మృతుల్లో ఐదుగురు చిన్నారులు..హరియాణాలో కలకలం
చండీగఢ్, ఫిబ్రవరి 16: హరియాణాలోని పాల్వాల్ జిల్లా చాయన్సా గ్రామంలో కలుషిత తాగునీటి కారణంగా అంటువ్యాధులు వ్యాప్తిచెందుతుండడం కలకలం రేపుతోంది. గత 15 రోజుల్లో ఐదుగురు పిల్లలు సహా మొత్తం 12మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలో అనేక మంది కామెర్లు, కాలేయ సంబంధిత వ్యాఽధులతో బాధ పడుతున్నారు. ఈ ఘటనతో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 865 కుటుంబాలు, సుమారు 5700 జనాభా ఉన్న ఈ గ్రామంలో వైద్యశిబిరాలు, ఇంటింటి సర్వేలు, స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఇప్పటివరకు 107 ఇళ్ల నుంచి తాగునీటి నమూనాలు సేకరించగా, వాటిలో 23 నమూనాల్లో ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు.
ఇవి కూడా చదవండి..
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..