ప్రాణదాత.. ఆ 10నెలల బిడ్డ!
ABN , Publish Date - Feb 17 , 2026 | 06:08 AM
పది నెలల శిశువు.. తీవ్రగాయాలతో తుదిశ్వాస విడుస్తూనే మరో నలుగురికి ఊపిరిలూదింది! ఆ బిడ్డ తల్లిదండ్రుల ఔదర్యమూ గొప్పదే. ఉబికివస్తున్న కన్నీటిని...
కేరళలో రోడ్డు ప్రమాదంలో ఆడ శిశువు బ్రెయిన్‌డెడ్
కళ్లు, కిడ్నీలు, గుండె, కాలేయం సేకరణ
తిరువనంతపురం, ఫిబ్రవరి 16: పది నెలల శిశువు.. తీవ్రగాయాలతో తుదిశ్వాస విడుస్తూనే మరో నలుగురికి ఊపిరిలూదింది! ఆ బిడ్డ తల్లిదండ్రుల ఔదర్యమూ గొప్పదే. ఉబికివస్తున్న కన్నీటిని దిగమింగుకొని తమ బిడ్డ అవయవాలను దానం చేసేందుకు వారు ముందుకొచ్చారు. ఆ పాప నుంచి వైద్యులు కాలేయం, కళ్లు, కిడ్నీలు, గుండె కవాటాన్ని సేకరించి నలుగురు పిల్లలకు అమర్చి వారికి కొత్త జీవితాన్నిచ్చారు. కేరళలోని ఎర్నాకులంలో ఈ ఘటన జరిగింది. ఆ చిన్నారి దాత పేరు ఆలెన్ షెరీన్ అబ్రహాం! కేరళలో అతిపిన్న వయసులో అవయవదానం చేసింది షెరీనే కావడం విశేషం.! కొట్టాయంలో ఫిబ్రవరి 5న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో షెరీన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. జీవన్‌దాన్ బృందం అవగాహన కలిగించిన మీదట తల్లిదండ్రులు తమ బిడ్డ అవయవాలను దానం చేసేందుకు ఒప్పుకొన్నారు. ఫిబ్రవరి 13న షెరీన్ అవయవాలను సేకరించి నలుగురు చిన్నారులకు అమర్చారు.
ఇవి కూడా చదవండి..
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..