-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking and Live Updates of 9th June 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jun 09 , 2026 | 07:18 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jun 09, 2026 21:12 IST
అమరావతి: GSDP లక్ష్యాలు, కేపీఐపై సీఎం చంద్రబాబు సమీక్ష
ప్రాజెక్టులతో ఆర్ధిక కార్యకలాపాలు రెట్టింపు: సీఎం చంద్రబాబు
ఆర్థిక వృద్ధి విశ్లేషణకు నెలవారీ నివేదికలు: సీఎం చంద్రబాబు
GSDP లక్ష్యం చేరుకునేలా సామర్థ్యాల పెంపు: సీఎం చంద్రబాబు
Aiతో పన్నులు, రెవెన్యూ వసూళ్లపై దృష్టి: సీఎం చంద్రబాబు
-
Jun 09, 2026 20:24 IST
శ్రీకాకుళం: వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
లోకేశ్ అంటే జగన్‌తోపాటు వైసీపీ నేతలకు భయం: రామ్మోహన్
లోకేశ్ టార్గెట్‌గా వైసీపీ ఫేక్ ప్రచారాలు: కేంద్రమంత్రి రామ్మోహన్
DSC విషయంలో వైసీపీ విషప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాం: రామ్మోహన్
వైసీపీ తాను తీసిన గోతిలో తానే పడింది: కేంద్రమంత్రి రామ్మోహన్
-
Jun 09, 2026 20:24 IST
శ్రీకాకుళం: టీడీపీ MLA కూన రవికుమార్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ ఒక ఫేక్ పార్టీ.. అదో గొడ్డలి పార్టీ: కూన రవికుమార్
పెదనాన్న కుమారుడితో సొంత బాబాయినే హత్య చేయించిన చరిత్ర జగన్‌ది: టీడీపీ MLA కూన రవికుమార్
వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం ఉంది: కూన రవికుమార్
-
Jun 09, 2026 20:08 IST
మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క
మహిళలను బస్సు ఓనర్లుగా చేశాం: మంత్రి సీతక్క
మహిళా సంఘాలకు రూ.61 వేల కోట్ల బ్యాంకు రుణాలు: సీతక్క
14 లక్షల మంది మహిళలకు అక్షరాస్యత శిక్షణ: మంత్రి సీతక్క
సమ్మర్ క్యాంపుల ద్వారా బాలికలకు సైకిల్ శిక్షణ: మంత్రి సీతక్క
-
Jun 09, 2026 20:03 IST
కామారెడ్డి: రైల్వేస్టేషన్‌లో ఇద్దరు అంతర్‌రాష్ట్ర స్మగ్లర్ల అరెస్ట్
10 కిలోల ఎండు గంజాయి స్వాధీనం
-
Jun 09, 2026 19:57 IST
యాదాద్రి: ప్రజలపై మేం పన్ను భారం మోపలేదు: భట్టి
గత ప్రభుత్వం వనరులను అడ్డగోలుగా కొల్లగొట్టింది: భట్టి
గత BRS హయాంలో ప్రజలపై పన్నుల భారం: భట్టి
గతంలో అర్హులకూ రేషన్ కార్డులు ఇవ్వలేదు: భట్టి
-
Jun 09, 2026 19:56 IST
కర్నూలు: పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థరెడ్డి
గత నెల కలెక్టరేట్ దగ్గర ధర్నాలో రెచ్చగొట్టే వ్యాఖ్యల కేసులో హాజరు
ఓ కంపెనీ నుంచి మంత్రి టీజీ భరత్ రూ.45 కోట్లు తీసుకున్నారంటూ బైరెడ్డి సిద్దార్థరెడ్డి ఆరోపణలు
బైరెడ్డి సిద్దార్థరెడ్డిపై పోలీసులకు మంత్రి టీజీ భరత్ ఫిర్యాదు
-
Jun 09, 2026 19:52 IST
ఖమ్మం: ఏడాదిలోనే పాలేరుకు గోదావరి జలాలు: మంత్రి తుమ్మల
రైతులను బాధపెట్టినవారు కూడా సీఎం రేవంత్‌ను విమర్శిస్తున్నారు: తుమ్మల
రైతులకు రూ.20 వేల కోట్లకుపైగా రుణమాఫీ చేశాం: మంత్రి తుమ్మల
ఆర్థిక భారం ఉన్నా రూ.27 వేల కోట్ల రైతు భరోసా ఇచ్చాం: తుమ్మల
-
Jun 09, 2026 19:49 IST
నల్గొండ: దామరచర్ల దగ్గర రోడ్డుప్రమాదం
రెండు బైక్‌లు ఢీకొని ముగ్గురి మృతి
మృతులు: ధనుంజయ్, నరసింహ, వెంకటేశ్
-
Jun 09, 2026 19:41 IST
హైదరాబాద్: పాతబస్తీలో కూలిన ఛత్తా బజార్ కమాన్
భారీ వర్షానికి కుప్పకూలిన కమాన్, స్థానికుల భయాందోళన
కొనసాగుతున్న సహాయకచర్యలు
-
Jun 09, 2026 19:32 IST
హైదరాబాద్: పాతబస్తీలో విషాదం
బండ్లగూడ దగ్గర విద్యుత్ షాక్‌తో ఇద్దరి మృతి
భారీ వర్షానికి రోడ్డుపై తెగిపడ్డ విద్యుత్ వైర్లు
వర్షపు నీటిలో విద్యుత్ ప్రవాహం వల్ల ఆటో దిగిన వెంటనే ఇద్దరు యువకులకు విద్యుత్ షాక్
మృతులు: జాఫర్(25), అబూ(16)
-
Jun 09, 2026 19:19 IST
మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
తెలంగాణలో క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించలేదని ఈసీకి బీజేపీ ఫిర్యాదు
ఆస్తుల వివరాలు తెలపలేదని బీజేపీ ఆరోపణ
మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు మీనాక్షి నామినేషన్
కోర్టులో తేల్చుకుంటాం: టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
-
Jun 09, 2026 19:12 IST
గతంలో ఎల్జీ పాలిమర్స్ బాధితులను వైసీపీ గాలికొదిలేసింది: కలిశెట్టి
ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై శవరాజకీయం చేస్తోంది: ఎంపీ కలిశెట్టి
బురదజల్లడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారు: ఎంపీ కలిశెట్టి
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం కాకుండా కాపాడేందుకు సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ అహర్నిశలూ శ్రమిస్తున్నారు: కలిశెట్టి
-
Jun 09, 2026 18:52 IST
ఏపీలో ఇప్పటికే 6 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు ఇచ్చాం: మంత్రి గొట్టిపాటి
త్వరలోనే మరో 10 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు మంజూరు: గొట్టిపాటి
-
Jun 09, 2026 18:52 IST
భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు హైడ్రా మాన్సూన్ యాక్షన్ ప్లాన్
ORR వరకు 889 వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించిన హైడ్రా
ఫ్లైఓవర్లపై వర్షపునీరు నిలవకుండా చూస్తున్నాం: ABNతో హైడ్రా కమిషనర్
వర్షాల సమయంలో ఐటీ కారిడార్‌పై స్పెషల్ ఫోకస్: హైడ్రా కమిషనర్
ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కోవడానికి సిద్ధం: ABNతో హైడ్రా కమిషనర్
-
Jun 09, 2026 18:46 IST
నెల్లూరు: పడారుపల్లిలో భార్య రేవతిని హత్య చేసిన భర్త శ్రీకాంత్
వేదాయపాళెం పీఎస్‌లో లొంగిపోయిన నిందితుడు శ్రీకాంత్
-
Jun 09, 2026 18:19 IST
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
రేపు రాత్రికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి పయనం
ఎల్లుండి నీతి అయోగ్ సమావేశానికి హాజరుకానున్న సీఎం రేవంత్
-
Jun 09, 2026 18:05 IST
కాకినాడ: 3 రోజులు దాటినా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ
కొండ కోనల్లో గాలిస్తున్నా కనిపించని రెండేళ్ల చిన్నారి
పోలీసులు, SDRF, అటవీ శాఖ బృందాల ముమ్మర గాలింపు
కొండలు, లోయలు, అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా అన్వేషణ
డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్‌తో గాలింపు చర్యలు ముమ్మరం
-
Jun 09, 2026 17:58 IST
ఆడబిడ్డలకు అండగా ఉండే బాధ్యత మాది: సీఎం రేవంత్
ఎవరెన్ని కుట్రలు చేసినా మహిళా సంఘాలను ఆదుకుంటున్నాం: రేవంత్
రూ.60 వేల కోట్ల రుణాలతో ఆర్థికంగా నిలబెడుతున్నాం: రేవంత్
ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలని మంచి చీరలు ఇస్తున్నాం: రేవంత్
ఆడబిడ్డలకు ఏం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం: రేవంత్
పంట మార్పిడి విషయంలో మహిళలు చొరవ చూపాలి: రేవంత్
-
Jun 09, 2026 17:47 IST
మహిళలను స్ఫూర్తిగా తీసుకుని పరిపాలన చేస్తున్నాం: రేవంత్
మహిళలను పరిపాలనలో భాగస్వామ్యం చేస్తాం: సీఎం రేవంత్
మహిళా సంఘాల్లో 67 లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు: రేవంత్
ఆడబిడ్డలతో పెట్టుకుంటే అధికారంలో ఉంటారా?: సీఎం రేవంత్
ఉచిత బస్సుతో స్కూళ్లలో ఆడపిల్లల డ్రాపవుట్స్ తగ్గాయి: రేవంత్
ఉచిత బస్సు పథకం కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాం: రేవంత్
-
Jun 09, 2026 17:44 IST
మహిళా సాధికారతకు టీజీ సర్కార్ మరో కీలక ముందడుగు
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మహిళా సంఘాలకు 553 ఆర్టీసీ బస్సుల పంపిణీ
పరేడ్ గ్రౌండ్స్‌లో బస్సులను ప్రారంభించిన సీఎం రేవంత్
-
Jun 09, 2026 17:28 IST
ఢిల్లీ: హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్స్‌పై CBI కొరడా
స్కామ్ కాంపౌండ్లలో లింక్‌లున్న ఇద్దరు కీలక నిందితుల అరెస్ట్
సైబర్ స్లేవరీ నెట్‌వర్క్‌లను అడ్డుకునేందుకు చర్యలు
భారీ జీతాలు ఆశ చూపి విదేశాల్లో ఉద్యోగాలంటూ భారతీయులకు ఎర
-
Jun 09, 2026 17:12 IST
సీఎం రేవంత్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు: కిషన్‌రెడ్డి
బీజేపీ నేతలను సీఎం రేవంత్ బెదిరిస్తున్నారు: కిషన్‌రెడ్డి
తిరగనివ్వను, పొలిమేర దాటనివ్వనంటూ బెదిరిస్తున్నారు: కిషన్‌రెడ్డి
రేవంత్ వ్యాఖ్యలను తెలంగాణ సమాజం గమనించాలి: కిషన్‌రెడ్డి
సీఎం రేవంత్‌కు మేం గులాంలము కాము: కిషన్‌రెడ్డి
-
Jun 09, 2026 17:09 IST
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో వర్షం
యూసుఫ్‌గూడ, అమీర్‌పేట్, SRనగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌లో వర్షం
కూకట్‌పల్లి, KPHB, బాచుపల్లి, ప్రగతినగర్‌లో వర్షం
గచ్చిబౌలి, లింగంపల్లి, హైటెక్ సిటీలో భారీ వర్షం
-
Jun 09, 2026 16:57 IST
వరంగల్: వర్ధన్నపేట మండలం ల్యాబర్తిలో దారుణం
గొడ్డలితో మరిది దాడిలో వదినకు తీవ్రగాయాలు
మహిళను MGM ఆస్పత్రికి తరలింపు, కేసు నమోదు
-
Jun 09, 2026 16:55 IST
ఢిల్లీలో సోనియా గాంధీతో సమావేశమైన మమతా బెనర్జీ
కాంగ్రెస్-టీఎంసీ భవిష్యత్తు వ్యూహంపై చర్చించినట్లు సమాచారం
సుమారు 20 మంది ఎంపీలు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం
కీలక నేత కాకోలీ ఘోష్ సహా పలువురు ఎంపీలు తిరుగుబాటు బాటలో ఉన్నారన్న ప్రచారం
ఆసక్తికరంగా మారిన బెంగాల్ రాజకీయ తాజా పరిణామాలు
-
Jun 09, 2026 16:51 IST
దేశంలోనే అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేశాం: మంత్రి ఉత్తమ్
ఖరీఫ్, రబీ కలిపి 147 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాం: ఉత్తమ్
సేకరించిన ధాన్యానికి రూ.35 వేల కోట్లు చెల్లించాం: ఉత్తమ్
8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లు సేకరించాం: ఉత్తమ్
ధాన్యం కొనుగోళ్లపై BRS, BJP తప్పుడు ప్రచారం: ఉత్తమ్
గన్నీ బ్యాగ్స్ లేవని దుష్ప్రచారం చేస్తున్నారు: మంత్రి ఉత్తమ్
-
Jun 09, 2026 16:44 IST
సింగరేణి బొగ్గు నిల్వలపై మంత్రి శ్రీధర్‌బాబుకి గంగుల సవాల్
బొగ్గు నిల్వలు ఉన్నాయో లేవో చూపించాలి: గంగుల
బొగ్గు నిల్వలు లేకపోతే తప్పుచేశామని ఒప్పుకోవాలి: గంగుల
రేపు ఉ.11 గంటలకు శ్రీధర్‌బాబు బొగ్గు నిల్వలు చూపించాలి: గంగుల
సింగరేణి బొగ్గు నిల్వలపై ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోంది: గంగుల
-
Jun 09, 2026 16:39 IST
ఢిల్లీ పర్యటనకు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్
రేపటి నుంచి మూడు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్న తమిళనాడు ముఖ్యమంత్రి
జూన్ 11న ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి హాజరుకానున్న విజయ్
-
Jun 09, 2026 16:27 IST
భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి: మంత్రి పొంగులేటి
సామాజిక సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం: పొంగులేటి
సీఎం సదుద్దేశంతో వాడిన హిట్లర్ పదాన్ని ప్రతిపక్షం వక్రీకరిస్తోంది: పొంగులేటి
భూ ఆక్రమణల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం: పొంగులేటి
-
Jun 09, 2026 16:23 IST
వేడెక్కిన బెంగాల్ రాజకీయం
మమతా బెనర్జీ నివాసం వద్ద హైడ్రామా
సెర్చ్ వారెంట్‌తో మమత నివాసానికి CID
CID అధికారులను అడ్డుకున్న TMC కార్యకర్తలు
ఫోర్జరీ కేసును దర్యాప్తు చేస్తున్న CID
-
Jun 09, 2026 16:06 IST
హైదరాబాద్: ఈగల్ ఫోర్స్, కస్టమ్స్, NCB సంయుక్త దాడులు
OG గంజాయి స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించిన పోలీసులు
మాదకద్రవ్యాల రవాణా ముఠా అరెస్ట్
హైదరాబాద్‌కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కళ అరెస్ట్
బ్యాంకాక్ నుంచి వస్తూ పట్టుబడిన నిందితురాలు
2.15 కిలోల OG గంజాయి స్వాధీనం
-
Jun 09, 2026 15:55 IST
తిరుపతి: భాకరాపేట ఘాట్ రోడ్‌లో తప్పిన ప్రమాదం
కలకడ నుంచి తిరుపతి వస్తుండగా అదుపుతప్పి పిట్టగోడను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
బస్సులో 48 మంది ప్రయాణికులు, తప్పిన ప్రమాదం
-
Jun 09, 2026 15:50 IST
నెల్లూరు: విక్రమ సింహపురి యూనివర్సిటీలో ఘనంగా స్నాతకోత్సవం
శాంత బయోటెక్ అధినేత వరప్రసాద్‌రెడ్డి, ఎంపీ బీద మస్తాన్‌రావు, ఆచార్య గోవర్ధన్ దాస్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన గవర్నర్ నజీర్
ప్రతిభ చాటిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన గవర్నర్
-
Jun 09, 2026 15:42 IST
ఏపీలో రానున్న 3 గంటల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షం
పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం: విపత్తు నిర్వహణ సంస్థ
విజయనగరం, అల్లూరి, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, పోలవరం జిల్లాలకు వర్ష సూచన
-
Jun 09, 2026 15:39 IST
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
394.50 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్
119.10 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
కొనుగోళ్ల మద్దతుతో కీలక సూచీల ర్యాలీ
పెట్టుబడిదారుల్లో సానుకూల సెంటిమెంట్
-
Jun 09, 2026 15:36 IST
బాసర: గోదావరిలో గల్లంతైన ముగ్గురి మృతి
మృతదేహాలను వెలికితీసిన గజ ఈతగాళ్లు
మృతులు హైదరాబాద్ కాచిగూడకు చెందిన సోదరులు చంద్రశేఖర్, రాంచందర్, మల్లేశ్ కుమార్
-
Jun 09, 2026 15:35 IST
అంగన్‌వాడీలకు జీతాలు చెల్లించాలని ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్
మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని రేవంత్ మభ్యపెడుతున్నారు: హరీశ్ రావు
ముందు అంగన్‌వాడీలకు జీతాలు చెల్లించి మహిళలపై ఉన్న గౌరవాన్ని నిరూపించుకోవాలి: హరీశ్ రావు
-
Jun 09, 2026 15:30 IST
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో హింసాత్మక ఘర్షణలు
ఘర్షణల్లో 30 మందికిపైగా మృతి, సుమారు 200 మంది గాయపడినట్లు సమాచారం
శాంతిభద్రతలు, భద్రతా కారణాల దృష్ట్యా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీపై నిషేధం
శుక్రవారం రాత్రి ఓ వ్యాపారిని భద్రతా సిబ్బంది కాల్చారనే ఆరోపణలతో ఉద్రిక్తతలు
ఘర్షణలకు దారితీసిన రావలకోట్ ఆందోళనలు
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టిన అధికారులు
-
Jun 09, 2026 15:26 IST
సిరాజ్‌కు విశ్రాంతి.. జట్టులోకి స్టార్ పేసర్
ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లకు స్టార్ బౌలర్ సిరాజ్‌కు విశ్రాంతి
అతడి స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకున్న బీసీసీఐ
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ వెల్లడి
-
Jun 09, 2026 15:07 IST
కడప: రాజంపేటలో చిట్టీల పేరుతో రూ.70 కోట్ల మోసం
బాధితుల ఫిర్యాదుతో చిట్టీల నిర్వాహకుడు నాగేంద్ర రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Jun 09, 2026 14:58 IST
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం: మంత్రి లోకేశ్
గాయపడినవారికి రూ.10 లక్షలు చొప్పున పరిహారం: మంత్రి లోకేశ్
ఇంత ప్రమాదం జరిగితే టీమ్ 11 కెప్టెన్ వచ్చారా?: మంత్రి లోకేశ్
టీం 11 కెప్టెన్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకులేదు: లోకేశ్
-
Jun 09, 2026 14:42 IST
అమరావతి: వైసీపీ శవ రాజకీయాలు చేస్తోంది: మంత్రి నారాయణ
స్టీల్ ప్లాంట్ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది: నారాయణ
ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలు మానుకోవాలి: మంత్రి నారాయణ
2029లో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు: నారాయణ
-
Jun 09, 2026 14:32 IST
విశాఖ: స్టీల్ ప్లాంట్ ఘటనపై కమిటీ వేసినట్టు కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ వెల్లడి
ముగ్గురు సభ్యులతో కమిటీని వేసిన కేంద్ర ప్రభుత్వం
బొకారో నేతృత్వంలో కమిటీని నియమించిన కేంద్రం
ఇప్పటికే ఉక్కు కర్మాగారంలో ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర బృందం
ప్రాథమికంగా కారణాలను విశ్లేషిస్తున్న బృందం
-
Jun 09, 2026 14:12 IST
డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో మార్పులకు కేంద్రం ప్రతిపాదనలు
ప్రస్తుతం 20 ఏళ్లుగా ఉన్న లైసెన్స్ వ్యాలిడిటీని 50 ఏళ్లకు పెంచే యోచన
లైసెన్స్ జారీ ప్రక్రియలోనూ పలు సంస్కరణలకు ప్రణాళిక
కొత్త ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు
విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు
-
Jun 09, 2026 14:07 IST
అనంతపురం: జాజరకల్ టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం
రోడ్డు పక్కన ఆగి ఉన్న సిమెంట్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టిన మరో లారీ
ఘటనలో రెండు లారీల్లో చెలరేగిన భారీ మంటలు
ప్రమాదంలో ఒకరు సజీవ దహనం
ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
-
Jun 09, 2026 14:03 IST
నిర్మల్: బాసరలో విషాదం
గోదావరి నదిలో ముగ్గురు భక్తుల గల్లంతు
హైదరాబాద్ కాచిగూడ నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చిన కుటుంబం
గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తూ గల్లంతు
ముగ్గురూ సొంత అన్నదమ్ములే
చంద్రశేఖర్(38), రామచందర్(36), మల్లేష్ కుమార్(31)గా గుర్తింపు
-
Jun 09, 2026 13:50 IST
ట్రై సిరీస్: రుతురాజ్ సెంచరీ.. శ్రీలంక ఎ టార్గెట్ ఎంతంటే?
దంబుల్లా వేదికగా భారత్ ఎ - శ్రీలంక ఎ మ్యాచ్
50 ఓవర్లలో భారత్ ఎ స్కోర్ 277/6
సెంచరీతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్(101)
కెప్టెన్ తిలక్ వర్మ(60) హాఫ్ సెంచరీ
నిరాశపరిచిన వైభవ్ సూర్యవంశీ(14)
శ్రీలంక ఎ టార్గెట్ 278
-
Jun 09, 2026 13:34 IST
జనగామ: బీఆర్ఎస్ నేతలు తెలంగాణను దోపిడీ చేశారు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే.. అంతా ఖాళీ చేసి పోయారు: భట్టి
పేదలకు చెందాల్సిన సొమ్మును బీఆర్ఎస్ దోచుకుంది: భట్టి
-
Jun 09, 2026 13:33 IST
విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన దురదృష్టకరం: బొత్స
కార్మికుల రక్షణకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాల్సింది
ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం: బొత్స
స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని మాత్రమే చూస్తున్నారు: బొత్స
కార్మికుల రక్షణకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు: బొత్స
-
Jun 09, 2026 13:09 IST
బెంగళూరు: కర్ణాటకలో నైరుతి రుతుపవనాల ప్రభావం
రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలు
రాబోయే 3-4 రోజుల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం
హవేరీ, బెళగావి జిల్లాల్లో దంచికొడుతున్న వానలు
వర్షపు నీటి ప్రవాహంతో వాగులను తలపిస్తున్న రోడ్లు
-
Jun 09, 2026 13:02 IST
జెట్ ఫ్యూయల్ ఉత్పత్తిని గణనీయంగా పెంచిన అమెరికా
ఉత్పత్తిలో పెద్ద భాగం అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది
మే 29 నాటికి జెట్ ఫ్యూయల్ ఇన్వెంటరీ 45 మిలియన్ బ్యారెళ్లకు చేరింది
ఇది 2021-2025 సగటుతో పోలిస్తే 7.5% ఎక్కువ
సరఫరా పెరుగుదలతో గ్లోబల్ ఇంధన మార్కెట్లపై ప్రభావం ఉండే అవకాశం
-
Jun 09, 2026 12:57 IST
విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రమాదస్థలిని పరిశీలించిన మంత్రి లోకేశ్
లోకేశ్‌తో పాటు ఏపీ టీడీపీ చీఫ్ పల్లా, మంత్రులు, ఎమ్మెల్యేలు
-
Jun 09, 2026 12:57 IST
అమరావతి: బుధవారం నాడు విశాఖకు వైఎస్ జగన్
స్టీల్‍ప్లాంట్ బాధిత కుటుంబాలను పరామర్శించనున్న జగన్
-
Jun 09, 2026 12:56 IST
విజయవాడ: పటమటలో భారీగా గంజాయి పట్టివేత
రూ.70లక్షల విలువైన 140 కేజీల గంజాయి స్వాధీనం
తమిళనాడు, ఒడిషా, కేరళంకు చెందిన ఐదుగురి అరెస్ట్, లారీ సీజ్
-
Jun 09, 2026 12:55 IST
ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం
బాలికను భవనం పైనుంచి తోసేసిన నిందితుడు గౌస్
బాలిక పరిస్థితి విషమం, ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స
ఈనెల 6న అఘాయిత్యం, ఆలస్యంగా వెలుగులోకి ఘటన
పోలీసులకు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు, పోక్సో కేసు నమోదు
-
Jun 09, 2026 12:50 IST
కాంగోలో ఎబోలా వ్యాప్తి తీవ్రతరం
మొత్తం 550 నిర్ధారిత కేసులు, 101 మరణాల నమోదు
ఆదివారం ఒక్కరోజే 35 కొత్త కేసులు, 10 మరణాల నమోదు
ప్రస్తుతం ఐసోలేషన్‌లో 309 మంది రోగులు
-
Jun 09, 2026 12:29 IST
విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు: డిప్యూటీ సీఎం పవన్
ప్రమాదానికి ముందే మరో ఘటన జరిగిందని కార్మికులు చెప్పారు: పవన్
ఇలాంటి ఘటన గత 33 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదు: పవన్
బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: పవన్
విశాఖ ఉక్కు ప్రైవేట్‌పరం అవకూడదన్నదే మా ఆకాంక్ష: పవన్
ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతర నిఘా ఉండాలి: పవన్
విచారణ కమిటీ నివేదిక వచ్చాక.. పరిష్కారం గురించి ఆలోచిద్దాం: పవన్
-
Jun 09, 2026 12:27 IST
విశాఖ: వామపక్ష నేతల తీరుపై మంత్రి లోకేశ్ ఆగ్రహం
మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలన్న వామపక్ష నేతలు
పరిహారం ఇచ్చి చేతులు దులుపుకునేందుకు రాలేదు: లోకేశ్
బాధితులకు అండగా ఉండేందుకే వచ్చా: మంత్రి లోకేశ్
-
Jun 09, 2026 12:27 IST
ఏపీ అసెంబ్లీలో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీ పూర్తి
సీఈవో వివేక్ యాదవ్ పర్యవేక్షణలో నామినేషన్ల పరిశీలన
రిటర్నింగ్ అధికారి వనితా రాణి ఆధ్వర్యంలో పరిశీలన పూర్తి
అభ్యర్థుల పత్రాలు సరిగా ఉన్నట్టు నిర్ధారించిన అధికారులు
జూన్ 21తో ముగియనున్న నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం
-
Jun 09, 2026 12:26 IST
రాజమండ్రి: దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు
ఎమ్మెల్సీ అనంతబాబును జిల్లా కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
విచారణకు హాజరైన అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ(A2)
ఈనెల 18న ఇద్దరు సాక్షులను విచారించనున్న న్యాయాధికారి
-
Jun 09, 2026 12:25 IST
జనగామ: చిల్పూర్ మండలం పల్లగుట్టలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
33/11kv సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి
పాల్గొన్న ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, విద్యుత్ అధికారులు
-
Jun 09, 2026 12:24 IST
నెల్లూరు: మర్రిపాడు మండలం రాజుపాలెంలో రెచ్చిపోతున్న భూ కబ్జాదారులు
50 ఎకరాల పేదల, ప్రభుత్వ భూముల ఆక్రమణ
న్యాయం చేయాలంటూ బాధితుల ఆందోళన
-
Jun 09, 2026 12:23 IST
తిరుపతి: చంద్రగిరిలో 8 ఏళ్ల బాలికపై బాలుడి అత్యాచారం
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బాలిక
పోలీసులకు బాలిక తల్లిండ్రుల ఫిర్యాదు
కేసు నమోదు చేసిన పోలీసులు
పక్కింటి బాలుడే అత్యాచారం చేసినట్టు ఆరోపణలు
-
Jun 09, 2026 12:22 IST
యూఎస్ వీసా ఇంటర్వ్యూల సుదీర్ఘ నిరీక్షణకు చెక్
750 డాలర్లు చెల్లిస్తే 10 రోజుల్లోనే వీసా ఇంటర్వ్యూ
ప్రీమియం సర్వీస్ పేరిట పైలట్ ప్రోగ్రామ్‌గా కొత్త సర్వీసు
బిజినెస్, టూరిస్ట్ వీసాలకు ఈ ఆప్షన్ అమలు
-
Jun 09, 2026 12:22 IST
హైదరాబాద్: స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడికి టీఆర్ఎస్ యత్నం
ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్
సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు, రోడ్డుపై బైఠాయింపు
ఆందోళనకు దిగిన టీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేసిన పోలీసులు
-
Jun 09, 2026 12:21 IST
సూర్యాపేట: మద్దిరాలలో విషాదం
తాటి చెట్టు పైనుంచి కిందపడి గీత కార్మికుడు మృతి
-
Jun 09, 2026 12:20 IST
హైదరాబాద్: పాతబస్తీలో గంజాయి పార్టీపై పోలీసుల దాడులు
క్రిస్టల్ టౌన్‌షిప్‌లోని ఓ ఇంట్లో పోలీసుల ఆకస్మిక తనిఖీ
గంజాయి తాగుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
220 గ్రాముల గంజాయి స్వాధీనం
ఊటీ, కొడైకెనాల్ నుంచి గంజాయి తీసుకొచ్చినట్టు గుర్తింపు
నిందితుల్లో ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు అతౌల్లా
-
Jun 09, 2026 12:05 IST
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
స్టీల్ ప్లాంట్ ప్రమాదస్థలిని పరిశీలించిన పవన్
-
Jun 09, 2026 11:10 IST
విశాఖ: కిమ్స్‌లో క్షతగాత్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్
మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశం
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని పవన్ హామీ
-
Jun 09, 2026 11:09 IST
బ్రెజిల్‌లో ‘ఆర్ఫన్’ సినిమాను తలపించేలాంటి ఘటన
12 ఏళ్ల బాలికలా నాటకమాడిన 37 ఏళ్ల మహిళ
ఓ కుటుంబాన్ని నమ్మించి దత్తత వెళ్లిన మహిళ
మోసం బయటపడటంతో అరెస్ట్
-
Jun 09, 2026 11:09 IST
విశాఖ: సెవెన్ హిల్స్ ఆస్పత్రికి మంత్రి నారా లోకేశ్
స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు లోకేశ్ పరామర్శ
కాసేపట్లో స్టీల్ ప్లాంట్ ప్రమాదస్థలిని పరిశీలించనున్న లోకేశ్

-
Jun 09, 2026 10:57 IST
కేరళం మాజీ సీఎం విజయన్ కుమార్తెకు ఈడీ సమన్లు
మనీలాండరింగ్ కేసులో విచారణకు పిలిచిన ఈడీ
-
Jun 09, 2026 10:48 IST
ట్రై సిరీస్: విఫలమైన వైభవ్ సూర్యవంశీ
శ్రీలంక వేదికగా శ్రీలంక ఎ, భారత్ ఎ మ్యాచ్
14 పరుగులకే పెవిలియన్ చేరిన వైభవ్ సూర్యవంశీ
-
Jun 09, 2026 10:46 IST
హైదరాబాద్: గచ్చిబౌలి చోరీ కేసులో నేపాలీ దంపతుల అరెస్ట్
ఇద్దరు నిందితులను ఉత్తరప్రదేశ్ నేపాల్ సరిహద్దు వద్ద పట్టుకున్న పోలీసులు
నెల క్రితం పారిశ్రామిక వేత్త ప్రకాష్ ఇంట్లో పనికి చేరిన నేపాలీ దంపతులు కమలా షాహీ, విమల్ షాహీ
ఉత్తరప్రదేశ్ పోలీసుల సహకారంతో నిందితులను పట్టుకున్న పోలీసులు
వీరి వద్ద నుంచి ఆరు కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
-
Jun 09, 2026 10:42 IST
వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ నియామకంలో గందరగోళం
ముగ్గురిని సూపరింటెండెంట్‌గా నియమిస్తూ వేర్వేరుగా ఉత్తర్వులు
-
Jun 09, 2026 10:41 IST
హైదరాబాద్: R&B ENC మోహన్‌నాయక్ నివాసంలో ACB సోదాలు
మియాపూర్ సహా 11 ప్రాంతాల్లో ACB తనిఖీలు
ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో సోదాలు
ఉదయం నుంచి కొనసాగుతున్న ACB తనిఖీలు
-
Jun 09, 2026 10:39 IST
విశాఖ: KGH ఆస్పత్రికి చేరుకున్న మంత్రి లోకేశ్
స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన లోకేశ్
బాధిత కుటుంబాల నుంచి ప్రమాద వివరాలు తెలుసుకున్న లోకేశ్
కాసేపట్లో స్టీల్ ప్లాంట్ ప్రమాదస్థలిని పరిశీలించనున్న లోకేశ్
-
Jun 09, 2026 10:33 IST
వరంగల్ : వర్ధన్నపేట మండలం ఇల్లందలో పేలిన బ్యాటరీ బైక్
దగ్ధమైన ఇంట్లోని వస్తువులు
బోరున విలపించిన బాధితుడు పోశాల సూర్యనారాయణ
-
Jun 09, 2026 10:05 IST
గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో భూకంపం
రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.2గా నమోదు
ఫ్లొరిడాలో కంపించిన భూమి
హోర్ముజ్ జలసంధిలో 5.0 తీవ్రతతో భూప్రకంపనలు
-
Jun 09, 2026 09:58 IST
నెల్లూరు: చెన్నాయపాళెంలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు
టీడీపీ దళిత నేత కృష్ణయ్య, మరికొందరిపై దాడి
కృష్ణయ్య పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు
కేసు నమోదు, ఘటనాస్థలిలో కత్తులు, కర్రల గుర్తింపు
-
Jun 09, 2026 09:40 IST
హైదరాబాద్: గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో భారీ చోరీ
వ్యాపారి ఇంట్లో కిలో బంగారు నగలు, వజ్రాల అపహరణ
ఇంట్లో పనిచేసే నేపాల్ దంపతులు చోరీ చేసినట్టు అనుమానం
నెల క్రితమే నేపాల్ దంపతులను పనిలో పెట్టుకున్న వ్యాపారి
వ్యాపారి కుటుంబం ముంబై వెళ్లి తిరిగి వచ్చేసరికి చోరీ
సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు
-
Jun 09, 2026 08:52 IST
నల్లగొండ కాంగ్రెస్ నేతల మధ్య గ్రూప్ విభేదాలు
పలు చౌరస్తాల్లో కైలాష్ నేత పుట్టినరోజు ఫ్లెక్సీల ఏర్పాటు
ఫ్లెక్సీలను చించివేసిన గుర్తు తెలియని వ్యక్తులు
కైలాష్ ఫ్లెక్సీలో కనిపించని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫొటో
-
Jun 09, 2026 08:51 IST
అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్
ఉదయం 10.50 గంటలకు సచివాలయానికి వెళ్తారు
మధ్యాహ్నం 03.00 గంటలకు జీఎస్‌డీపీపై సమీక్ష చేస్తారు
సాయంత్రం 04.00 గంటలకు ఆర్టీజీఎస్‌పై సమీక్షిస్తారు
05.50 గంటలకు నివాసానికి చేరుకుంటారు
-
Jun 09, 2026 08:16 IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత
-
Jun 09, 2026 08:13 IST
కర్నూలు: రాయలసీమ యూనివర్సిటీలో దొంగల హల్ చల్
వారం రోజుల వ్యవధిలో మూడు చోరీలు
విలువైన సామాగ్రితో పాటు నీటి కొళాయిల అపహరణ
-
Jun 09, 2026 08:10 IST
ఉజ్వల లబ్ధిదారులకు రాయితీ సిలిండర్లలో కోత
9 సిలిండర్ల నుంచి 4 సిలిండర్లకు కుదించిన కేంద్రం
ఏడాదికి నాలుగు సిలిండర్లకే పరిమితం
-
Jun 09, 2026 08:08 IST
విశాఖ: స్టీల్‌ప్లాంట్ ఘటనాస్థలిని పరిశీలించిన కేంద్రమంత్రి భూపతిరాజు
స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాకరం: భూపతిరాజు
బాధిత కుటుంబాల భవిష్యత్ బాధ్యత ప్లాంట్‌దే: భూపతిరాజు
కార్మికులు ఆందోళన చెందొద్దు: భూపతిరాజు
ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాం: భూపతిరాజు
-
Jun 09, 2026 07:45 IST
నిరసనలతో అట్టుడుకుతున్న పీఓకే
పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణల్లో 11 మంది మృతి
నేడు బంద్‌కు పిలుపునిచ్చిన జేఏఏసీ
అసెంబ్లీలో రిజర్వేషన్ వద్దంటూ డిమాండ్
-
Jun 09, 2026 07:18 IST
నేడు హైదరాబాద్‌లో మహిళా కాంగ్రెస్ ధర్నా
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ర్యాలీ
గాంధీభవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ
-
Jun 09, 2026 07:18 IST
నేడు విశాఖకు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్
ఘటనా స్థలాన్ని పరిశీలించనున్న పవన్, లోకేశ్
క్షతగాత్రులను పరామర్శించనున్న పవన్, లోకేశ్
-
Jun 09, 2026 07:18 IST
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
బుధవారం నాడు ప్రధాని మోదీ అధ్యక్షతన NDA సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశానికి హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
మోదీ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సమావేశం
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై చర్చించే అవకాశం