ఇంటికి ఈ దిశలో గులాబీ రేకులు ఉంచితే ధనలక్ష్మి కటాక్షం!
ABN , Publish Date - Jun 25 , 2026 | 02:50 PM
ఇంట్లో సానుకూల శక్తి, ప్రశాంతమైన వాతావరణం, ఆర్థికాభివృద్ధి కోసం వాస్తు శాస్త్రంలో అనేక పరిహారాలను సూచిస్తారు. వాటిలో గులాబీ రేకులతో చేసే ఒక సులభమైన చిట్కా ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందింది.
ఇంటర్నెట్ డెస్క్: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సానుకూల శక్తిని పెంచడంలో గులాబీ పువ్వులకు ప్రత్యేక స్థానం ఉంది. ఒక గాజు గిన్నెలో నీరు నింపి అందులో తాజా గులాబీ రేకులు వేసి ఉంచితే ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుందని నమ్ముతారు. ముఖ్యంగా ఈ గిన్నెను తూర్పు దిశలో ఉంచడం వల్ల ఆర్థిక శ్రేయస్సు, అదృష్టం కలిసోస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా ఇళ్ల అలంకరణ కోసం పూలు, మొక్కలను ఉపయోగిస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రంలో గులాబీ పువ్వుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందమైన రంగులు, సువాసనతో ఆకట్టుకునే గులాబీని కేవలం అలంకరణకే కాకుండా సానుకూల శక్తికి ప్రతీకగా కూడా భావిస్తారు.
సానుకూల వాతావరణం
తాజా గులాబీ రేకులు ఇంట్లో ఉంచడం వల్ల సహజమైన సువాసన వ్యాపించి మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అందుకే చాలా మంది పూజా గది, హాలు లేదా ఇంటి ప్రధాన ద్వారం వద్ద గులాబీ రేకులను ఉంచుతుంటారు. దీంతో ఇంటికి వచ్చే వారికి కూడా ఆహ్లాదకరమైన అనుభూతి కలుగుతుందని చెబుతారు.

గాజు గిన్నెలోనే ఎందుకు?
వాస్తు ప్రకారం శుభ్రమైన గాజు గిన్నెలో నీరు నింపి అందులో తాజా గులాబీ రేకులు వేయాలి. ఈ గిన్నెను గాలి, వెలుతురు బాగా వచ్చే ప్రదేశంలో ఉంచితే గులాబీ సువాసన ఇల్లంతా వ్యాపించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
తూర్పు దిశలో ఉంచితే కలిగే ప్రయోజనాలు
వాస్తు శాస్త్రంలో తూర్పు దిశను శుభప్రదమైన దిశగా పరిగణిస్తారు. గులాబీ రేకులతో కూడిన నీటి గిన్నెను ఈ దిశలో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుందని విశ్వసిస్తారు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఉత్సాహం పెరగడంతో పాటు ఆర్థికాభివృద్ధికి కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని నమ్మకం.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?