Share News

చర్మం, జుట్టు కోసం పసుపు నూనె.. ఉపయోగించే ముందు ఇవి తెలుసుకోండి!

ABN , Publish Date - Sep 20 , 2026 | 09:35 PM

చర్మం, జుట్టు సంరక్షణ కోసం రకరకాల నూనెలను ఉపయోగిస్తుంటాం. అలాంటి వాటిలో పసుపు మొక్క వేర్ల నుంచి తయారయ్యే టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఒకటి. ఇందులోని కొన్ని సహజ గుణాలు చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

చర్మం, జుట్టు కోసం పసుపు నూనె.. ఉపయోగించే ముందు ఇవి తెలుసుకోండి!
Turmeric Essential Oil Benefits

ఇంటర్నెట్ డెస్క్: చర్మం, జుట్టు సంరక్షణ కోసం చాలామంది వివిధ రకాల ఎసెన్షియల్ ఆయిల్స్‌ను ఉపయోగిస్తుంటారు. అలాంటి వాటిలో పసుపు మొక్క వేర్ల నుంచి తయారయ్యే టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఒకటి. ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉండటంతో చర్మం, కురుల సంరక్షణలో ఇది ఉపయోగపడవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.


మొటిమలు, జిడ్డు చర్మం:

చర్మంలో సీబమ్ అధికంగా ఉత్పత్తి అయితే ముఖం జిడ్డుగా మారి మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. పసుపు నుంచి లభించే కొన్ని పదార్థాలు సీబమ్‌ను నియంత్రించడంలో సహాయపడవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అలాగే, దీని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మంలో మంట, ఎర్రదనాన్ని తగ్గించడంలో తోడ్పడవచ్చు.

జుట్టు సంరక్షణ:

పసుపు నూనెలోని యాంటీమైక్రోబియల్, యాంటీఫంగల్ లక్షణాలు తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడవచ్చని చెబుతున్నారు. చుండ్రు వంటి సమస్యల్లో కూడా కొంత ఉపయోగకరంగా ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

ఎలా ఉపయోగించాలి?:

ఎసెన్షియల్ ఆయిల్‌ను నేరుగా చర్మం లేదా తలకు రాయడం మంచిది కాదు. కొబ్బరి, జొజోబా లేదా ఆలివ్ ఆయిల్ వంటి క్యారియర్ ఆయిల్‌లో కొద్దిగా కలిపి ఉపయోగించాలి. ముందుగా చిన్న భాగంలో ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. అలర్జీ, మంట లేదా దురద వస్తే వెంటనే వాడటం ఆపాలి.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

సెప్టెంబర్‌-అక్టోబర్‌లో ఊపిరితిత్తులపై ప్రభావం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

యూరిక్ యాసిడ్ ఉన్నవారు పుట్టగొడుగులు తినొచ్చా?

Updated Date - Sep 20 , 2026 | 09:35 PM