తెల్ల జుట్టుకు బియ్యం నీరు ఉపయోగపడుతుందా?
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:26 PM
బియ్యం కడిగిన నీరు జుట్టు సంరక్షణలో ఉపయోగపడుతుందని చాలామంది నమ్ముతారు. అయితే బియ్యం నీటితో తెల్ల జుట్టు సహజంగా నల్లగా మారుతుందా? దీనిపై ఉన్న వాస్తవాలు, బియ్యం నీటిని జుట్టుకు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: తెల్ల జుట్టు సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో హెయిర్ డైలు, ఇతర ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. అయితే బియ్యం కడిగిన నీరు జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని కొందరు చెబుతుంటారు. మరి ఇందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..
బియ్యం నీటిలో ఉండే కొన్ని పోషకాలు జుట్టు మెత్తగా, మెరిసేలా కనిపించడంలో సహాయపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే జుట్టు చిక్కులు తగ్గించడం, సాఫ్ట్‌గా ఉండేలా చేయడంలో కొంతమేర ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఎలా ఉపయోగించాలి?
బియ్యం కడిగిన నీటిని తలకు షాంపూ చేసిన తర్వాత జుట్టుకు అప్లై చేసి 10–15 నిమిషాలు ఉంచాలి. తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించడం మంచిది.
కాఫీ పొడి కలిపితే?
కొంతమంది బియ్యం నీటిలో కాఫీ పొడి కలిపి హెయిర్ ప్యాక్‌గా ఉపయోగిస్తారు. దీనివల్ల జుట్టుకు తాత్కాలికంగా కొద్దిగా ముదురు రంగు కనిపించవచ్చు. అయితే ఇది తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చదు.
గమనించాల్సిన విషయం
బియ్యం నీరు జుట్టు సంరక్షణలో సహాయపడే సహజమైన చిట్కా మాత్రమే. ఇది తెల్ల జుట్టును పూర్తిగా నల్లగా మార్చుతుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. తెల్ల జుట్టు అధికంగా వస్తుంటే లేదా అకస్మాత్తుగా పెరిగితే, విటమిన్ లోపాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కారణం కావచ్చు. అలాంటి సందర్భాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్