Share News

ఐస్‌క్రీమ్ వర్సెస్ ఫ్రోజన్ డెజర్ట్.. వీటి మధ్య తేడా ఏంటో తెలుసా?

ABN , Publish Date - Nov 18 , 2026 | 03:29 PM

మీకు ఐస్‌క్రీమ్స్ అంటే ఇష్టమా? తరచూ ఐస్‌క్రీమ్స్ తినేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే..

ఐస్‌క్రీమ్ వర్సెస్ ఫ్రోజన్ డెజర్ట్..  వీటి మధ్య తేడా ఏంటో తెలుసా?
Ice Cream Vs Frozen Dessert

ఇంటర్నెట్ డెస్క్: చాలా మందికి ఐస్‌క్రీమ్‌లు అంటే చెప్పలేనంత ఇష్టం. భోజనం చేసిన తరువాత లేదా షికారుకు వెళ్లినప్పుడు ఐస్‌క్రీమ్స్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, చాలా మంది ఫ్రోజన్ డెజర్ట్‌లను ఐస్‌‌‌క్రీమ్స్‌గా భావించి తినేస్తుంటారు. రుచిలోనే కాకుండా, చూడటానికి దాదాపు ఒకేలా కనిపించే వీటి మధ్య సున్నితమైన తేడాలను పట్టించుకోరు. ఈ విషయాలపై వినియోగదారుల్లో అవగాహన పెంచేందుకు ఏకంగా గుజరాత్ ప్రభుత్వం రంగంలోకి దిగింది.


ఐస్‌క్రీమ్ వర్సెస్ ఫ్రోజన్ డెజర్ట్

ఐస్‌క్రీమ్స్ గురించి అందరికీ తెలిసిందే. వీటిని మిల్క్ ఫ్యాట్ (పాలల్లో ఉండే కొవ్వు పదార్థాలు), ఇతర డెయిరీ ఉత్పత్తులతో తయారు చేస్తారు. చూడటానికి దాదాపు ఐస్‌క్రీమ్‌లా కనిపించే ఫ్రోజన్ డెజర్ట్‌ను తయారు చేసేందుకు మిల్క్ ఫ్యాట్‌కు బదులుగా వెజిటెబుల్ ఆయిల్స్‌ను వినియోగిస్తారు. దీంతో పాటు పాల నుంచి తయారు చేసిన మిల్క్ పౌడర్‌ను కూడా వినియోగిస్తారు. దీంతో, చాలా మంది వినియోగదారులు ఫ్రోజన్ డెజర్ట్‌లను కూడా ఐస్‌క్రీమ్‌లనే అనుకుంటారు.

ic crems.jpg


ఈ అంశాలపై గుజరాత్ మంత్రి పాన్‌షేరియా స్పందించారు. దాదాపు 95 శాతం మంది వినియోగదారులు ఫ్రోజన్ డెజర్ట్‌లను ఐస్‌క్రీమ్‌లుగా భావించి తింటున్నారని చెప్పారు. ఈ విషయాల్లో అవగాహన కల్పించేందుకు గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఇందులో భాగంగా షాపుల వారిని కూడా తాము అప్రమత్తం చేశామని వెల్లడించారు. ఫ్రోజన్ డెజర్ట్, ఐస్‌‌క్రీమ్ మధ్య తేడాను కస్టమర్లకు స్పష్టంగా వివరించి చెప్పాలని సూచిస్తున్నామని అన్నారు. ఇక కంపెనీలు కూడా తమ ఉత్పత్తి ఏదో స్పష్టంగా వినియోగదారులకు అర్థమయ్యేలా లేబుల్స్ అతికించాలని ఆదేశించేందుకు ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీసీఏ) కూడా సిద్ధమవుతోంది.


ఈ వార్తలనూ చదవండి:

ఆరోగ్యకరమైన అరికెల జావ.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేసుకోండి

మిక్స్‌డ్ ఫ్రూట్స్ తింటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Updated Date - Nov 18 , 2026 | 04:21 PM