ఈ 5 లక్షణాలు ఉన్నవారిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడుస్తారు
ABN , Publish Date - Jul 20 , 2026 | 03:45 PM
వివాహం అనేది జీవితంలో తీసుకునే అత్యంత ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి. సరైన జీవిత భాగస్వామిని ఎంచుకుంటే జీవితం ఆనందంగా సాగుతుంది.. కానీ తొందరపాటు నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: వివాహం అనేది జీవితంలో తీసుకునే అత్యంత ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి. ఈ నిర్ణయం కేవలం భావోద్వేగాలతో కాకుండా, ఆలోచన, వివేకంతో తీసుకోవాలని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో సూచించారు. జీవిత భాగస్వామి మంచివారైతే జీవితం ఆనందంగా సాగుతుంది. కానీ సరైన వ్యక్తిని ఎంచుకోకపోతే భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. చాణక్య నీతి ప్రకారం.. వివాహం చేసుకునే ముందు వ్యక్తి రూపం కంటే వారి స్వభావం, ఆలోచనలు, అలవాట్లు, ప్రవర్తనను గమనించడం చాలా ముఖ్యమని చెబుతారు.
అందాన్ని చూసి పెళ్లి చేసుకున్నవారు
చాణక్యుడి ప్రకారం.. కేవలం బాహ్య అందాన్ని చూసి వివాహ నిర్ణయం తీసుకోకూడదు. రూపం కంటే వ్యక్తి స్వభావం, ఆలోచనలు, ప్రవర్తనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. జీవిత భాగస్వామిగా ఎంచుకునే ముందు వారి గుణగణాలను పూర్తిగా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.
ఎప్పుడూ కోపంగా, కఠినంగా మాట్లాడే వారు
ప్రతి చిన్న విషయానికీ కోపపడే వారు, ఇతరులను బాధించేలా మాట్లాడే వారు కుటుంబంలో ప్రశాంతతను దెబ్బతీయవచ్చు. చాణక్య నీతి ప్రకారం.. తన కోపాన్ని అదుపు చేసుకోలేని వ్యక్తితో జీవితం కష్టంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు వారి కోపం, ప్రవర్తనను గమనించాలని సూచిస్తారు.
డబ్బుపై ఎక్కువ మక్కువ ఉన్నవారు
వివాహ బంధం ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉండాలి. కేవలం డబ్బు, ఆస్తి, హోదాకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తులు కష్టకాలంలో తోడుగా ఉండకపోవచ్చని చాణక్యుడు హెచ్చరించారు. డబ్బు కంటే బంధాలకు విలువ ఇచ్చే వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం మంచిది.
ఇతరులను గౌరవించని వారు
ఒక వ్యక్తి తనతో పాటు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారో గమనించడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు, పెద్దలు, ఇతరులను గౌరవించని వ్యక్తి భవిష్యత్తులో జీవిత భాగస్వామిని కూడా గౌరవించకపోవచ్చని చాణక్య నీతి చెబుతుంది. వివాహం ఇద్దరు వ్యక్తులనే కాదు.. రెండు కుటుంబాలను కూడా కలుపుతుంది కాబట్టి గౌరవ భావన చాలా అవసరం.
సత్ప్రవర్తన లేని వారు
చాణక్యుడి ప్రకారం.. నిజాయతీ లేని వారు, అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్నవారు, ఇతరులను మోసం చేసే స్వభావం ఉన్నవారు మంచి జీవిత భాగస్వాములు కాలేరు. ఒక వ్యక్తి అలవాట్లు, ప్రవర్తన వారి భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అందుకే వివాహానికి ముందు వారి స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం అవసరం.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఫ్రిజ్ లేకుండానే టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా?
ఈ తేదీల్లో పుట్టినవారిది రాజసమైన వ్యక్తిత్వం..!