Share News

జీవితంలో ఎదగాలంటే ఈ అలవాట్లను అదుపులో ఉంచుకోండి

ABN , Publish Date - Jul 14 , 2026 | 03:05 PM

ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో విజయవంతమైన జీవితానికి అవసరమైన ఎన్నో విలువైన సూచనలు చేశారు. కోపం, మాటలు, అనవసర ఖర్చులను అదుపులో ఉంచగలిగితే వ్యక్తిగతంగా, ఆర్థికంగా పురోగతి సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.

జీవితంలో ఎదగాలంటే ఈ అలవాట్లను అదుపులో ఉంచుకోండి
Chanakya Success Tips

ఇంటర్నెట్ డెస్క్: ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన సూచనలు చేశారు. జీవితంలో ఎదగాలంటే కొన్ని అలవాట్లను నియంత్రించుకోవడం చాలా అవసరమని సూచించారు. లేదంటే విజయాన్ని సాధించడం కష్టమవుతుందని చెప్పారు.


ఆచార్య చాణక్యుడి ప్రకారం.. చెడు అలవాట్లు మన పురోగతికి అడ్డంకిగా మారతాయి. వాటిని అదుపులో ఉంచుకున్నవారే జీవితంలో ముందుకు వెళ్లగలరు. మరి జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఏ అలవాట్లను నియంత్రించాలో తెలుసుకుందాం..

కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి

చాణక్యుడి ప్రకారం, మనిషికి అతిపెద్ద శత్రువు కోపం. కోపంలో ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టం. దీంతో సంబంధాలు దెబ్బతినడంతో పాటు పనుల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే కోపం వచ్చిన వెంటనే స్పందించకుండా, కాసేపు ప్రశాంతంగా ఉండటం మంచిది. ఇలా చేయడం వల్ల అనవసర సమస్యలు దూరమవుతాయి.

జాగ్రత్తగా మాట్లాడాలి

మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించడం చాలా ముఖ్యం. మధురంగా, మితంగా మాట్లాడే అలవాటు మంచి సంబంధాలను పెంచుతుంది. అలాగే ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవడం కూడా మంచిది కాదు. ముఖ్యంగా మీ లక్ష్యాలు, ప్రణాళికలను అవసరమైన వారితో మాత్రమే పంచుకోవడం మంచిది.


కోరికలను నియంత్రించాలి

అత్యాశ మనిషిని ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంచుతుంది. అందుకే మీ వద్ద ఉన్నదానితో సంతృప్తి చెందుతూ, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని చాణక్యుడు సూచించారు. ఇలా ఉంటే మనసుకు ప్రశాంతతతో పాటు జీవితంలో మంచి మార్పులు వస్తాయి.

అనవసర ఖర్చులను తగ్గించాలి

డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని సరైన విధంగా ఖర్చు చేయడం కూడా అంతే ముఖ్యం. అవసరం లేని ఖర్చులు చేస్తే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సంపాదించిన డబ్బును పొదుపుగా, తెలివిగా వినియోగిస్తే ఆర్థికంగా బలపడవచ్చు.


Also Read:

ఫ్రిజ్ లేకుండానే టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా?

ఈ తేదీల్లో పుట్టినవారిది రాజసమైన వ్యక్తిత్వం..!

Updated Date - Jul 14 , 2026 | 03:24 PM