మౌనం మంచిదే.. కానీ ఈ పరిస్థితుల్లో కాదు
ABN , Publish Date - Jun 08 , 2026 | 09:50 AM
మౌనంగా ఉండటం మంచిదే కానీ, ప్రతి సందర్భంలోనూ మంచిది కాదని ఆచార్య చాణక్యుడు సూచించారు. కొన్ని సందర్భాల్లో మన మౌనమే మన విలువను తగ్గించి, అవకాశాలను దూరం చేసే ప్రమాదం ఉందని ఆయన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మౌనం ఒక గొప్ప గుణంగా భావించినప్పటికీ, ప్రతి సందర్భంలోనూ మౌనంగా ఉండటం సరైనది కాదని ఆచార్య చాణక్యుడు పేర్కొన్నారు. కొన్ని పరిస్థితుల్లో మౌనంగా ఉండటం వల్ల వ్యక్తిగతంగా, వృత్తిపరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన సూచించారు. మీ మౌనం మీకు వ్యతిరేకంగా మారుతోందని తెలిపే కొన్ని ముఖ్యమైన సంకేతాల గురించి చాణక్య నీతి ఏమి చెబుతోందో తెలుసుకుందాం..
అభిప్రాయాన్ని అడగకపోవడం
కుటుంబంలో, స్నేహితుల మధ్య లేదా కార్యాలయంలో మీ అభిప్రాయాన్ని అడగడం మానేస్తే, మీరు మాట్లాడరనే భావన వారిలో ఏర్పడి ఉండవచ్చు. మీరు ఆసక్తి చూపడం లేదని వారు అనుకోవచ్చు. అవసరమైన చోట మీ అభిప్రాయాన్ని చెప్పడం మీ విలువను పెంచుతుంది.
నిర్ణయాలు తీసుకోవడం
మీ ఇష్టాయిష్టాలను వ్యక్తపరచకపోతే, ఇతరులు మీకు బదులుగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తారు. మీరు ఏం కోరుకుంటున్నారో వారికి తెలియకపోవడం వల్ల మీ అభిప్రాయానికి ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉంటుంది.
మీ భావాలను అర్థం చేసుకోకపోతే
చాలామంది తమ బాధలు, సమస్యలు, భావోద్వేగాలను ఇతరులతో పంచుకోరు. దీంతో కాలక్రమేణా మీ మనసులో ఏముందో ఇతరులు అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. నమ్మకమైన వ్యక్తులతో అవసరమైన విషయాలను పంచుకోవడం సంబంధాలను బలపరుస్తుంది.
మరొకరికి గుర్తింపు
మీరు కష్టపడి పని చేసినా గుర్తింపు మరొకరికి దక్కుతుంటే, మీ విజయాలను మీరు ఎప్పుడూ చెప్పకపోవడమే కారణం కావచ్చు. మీ గురించి గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ అవసరమైన సమయంలో మీ కృషిని తెలియజేయడం కూడా ముఖ్యం.
తప్పును చూసినా మాట్లాడకపోతే
ఎవరైనా తప్పు చేస్తున్నా, అన్యాయం జరుగుతున్నా మీరు మౌనంగా ఉంటే, దాన్ని మీ అంగీకారంగా భావించే అవకాశం ఉంది. చాణక్యుడి ప్రకారం, అన్యాయం జరిగినప్పుడు మౌనంగా ఉండటం మంచిది కాదు. అలాంటి సమయంలో ధైర్యంగా మీ అభిప్రాయాన్ని చెప్పాలి.
మౌనం ఒక గొప్ప గుణం. కానీ ప్రతి సందర్భంలోనూ మౌనంగా ఉండటం సరైంది కాదు. అవసరమైనప్పుడు మాట్లాడటం, మీ భావాలను వ్యక్తపరచడం, అన్యాయాన్ని ప్రశ్నించడం కూడా జీవితంలో ఎంతో ముఖ్యం. సమయానికి మాట్లాడటం మీ వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని మరింత పెంచుతుంది.
Also Read:
విండ్ చైమ్.. ఈ ప్రదేశాల్లో అస్సలు పెట్టకండి
ఫిట్‌నెస్ కోసం భోజనం మానేస్తున్నారా? జాగ్రత్త..