Share News

ఈ టిప్స్‌ పాటిస్తే కాఫీతో అద్భుతమై ఎనర్జీ బూస్ట్

ABN , Publish Date - Mar 03 , 2026 | 09:45 PM

సైడ్ ఎఫెక్ట్స్ బెడద లేకుండా కాఫీతో తక్షణ ఎనర్జీ బూస్ట్ కావాలనుకుంటే కొన్ని టిప్స్ ఫాలో కావాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఈ టిప్స్‌ పాటిస్తే కాఫీతో అద్భుతమై ఎనర్జీ బూస్ట్
Best Time To Drink Coffee

ఇంటర్నెట్ డెస్క్: మనలో చాలా మంది ఉదయాన్నే కాఫీ తాగనిదే ఉండలేరు. కాఫీ తాగకపోతే రోజంతా ఏదో వెలితిగా ఉంటుందని అంటుంటారు. ఇక కాఫీలోని యాంటీఆక్సిడెంట్స్‌తో పార్కిసన్స్, ఆల్జైమర్స్, డయాబెటిస్ వంటి రోగాల ముప్పు కూడా తగ్గుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కాఫీతో పూర్తి ప్రయోజనం పొందాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కాఫీ తాగడానికి కొన్ని సమయాలు ఉన్నాయని అంటున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాఫీని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ టిప్స్ తప్పనిసరిగా ఫాలో కావాలని అంటున్నారు.

నిపుణులు చెప్పే దాని ప్రకారం, ఉదయం లేవగానే కాఫీ తాగకపోవడమే మంచిది. ఆ సమయంలో ఒంట్లో కార్టిసాల్ హార్మోన్ గరిష్ఠ స్థాయిలో ఉన్నందున కాఫీ తాగకూడదు. నిద్ర లేచాక కనీసం గంటన్నర తరువాత ఈ హార్మోన్ స్థాయిలు సాధారణ స్థితికి వస్తాయి. అప్పుడు, నిశ్చితంగా కాఫీని ఎంజాయ్ చేయొచ్చు.


ఇక మధ్యాహ్నం ఎనర్జీ బూస్టు కావాలనుకునే వారు ఒంటి గంట నుంచి మూడు గంటల లోపు కాఫీ తాగడం మంచిది. జిమ్‌లో ఎక్సర్‌సైజు‌లకు గంట ముందు కాఫీ తాగినా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి నిద్ర చెదిరిపోకుండా ఉండాలంటే పొద్దుపోయాక కాఫీ జోలికి వెళ్లకుండా ఉండటమే బెటర్

ఇక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజుకు మూడు లేదా నాలుగు కప్పులకు మించి కాఫీ తాగకూడదు. కాఫీ అలవాటు ఉన్న వారు తగినంత నీరు తాగాలి. కాఫీకి చక్కెర లేదా ఇతర అడిటివ్స్‌ను జోడించడాన్ని తగ్గించాలి. కాఫీని ఇష్టపడేవారు ఈ టిఫ్స్‌ను ఫాలో అయ్యి కాఫీని ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు.


ఇవీ చదవండి:

బెల్లం తింటున్నారా? కల్తీని ఇలా గుర్తించండి..!

పూరి సాఫ్ట్‌గా రావాలంటే ఇలా చేయండి

Updated Date - Mar 03 , 2026 | 09:52 PM