Share News

సొట్టబుగ్గలు ఉన్నవారు నిజంగా అదృష్టవంతులా?

ABN , Publish Date - Jun 24 , 2026 | 01:52 PM

సొట్టబుగ్గలు ఉన్నవారు నిజంగా అదృష్టవంతులా? నవ్వినప్పుడు ముఖానికి ప్రత్యేకమైన అందాన్ని తెచ్చే సొట్టబుగ్గలు కేవలం సౌందర్యానికి మాత్రమే కాకుండా అదృష్టానికి కూడా సంకేతమా?

సొట్టబుగ్గలు ఉన్నవారు నిజంగా అదృష్టవంతులా?
Dimples Meaning in Astrology

ఇంటర్నెట్ డెస్క్: సొట్టబుగ్గలున్న వారు అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. నవ్వినప్పుడు ముఖానికి ప్రత్యేకమైన అందాన్ని తెచ్చే సొట్టబుగ్గలు అదృష్టానికి ప్రతీకగా కూడా భావిస్తారు. జ్యోతిష్యం, హస్తసాముద్రిక శాస్త్రాల ప్రకారం సొట్టబుగ్గలు కేవలం సౌందర్యానికి మాత్రమే కాకుండా వ్యక్తిత్వం, తెలివితేటలు, ఆత్మవిశ్వాసం, అదృష్టానికి కూడా సూచికగా పరిగణిస్తారు.


చిన్న వయసులోనే గుర్తింపు

సొట్టబుగ్గలు ఉన్నవారు చిన్నప్పటి నుంచే ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారని నిపుణులు చెబుతున్నారు. వీరికి మంచి జ్ఞాపకశక్తి, చురుకైన ఆలోచనా శక్తి ఉండటంతో సమాజంలో త్వరగా గుర్తింపు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.

ఆత్మవిశ్వాసం ఎక్కువ

ఇలాంటి వ్యక్తులు సాధారణంగా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కొత్త పరిస్థితులను ఎదుర్కోవడంలో వీరు వెనుకడుగు వేయరని.. సమస్యలకు వెంటనే పరిష్కారం కనుగొనే నైపుణ్యం కూడా వీరికి ఉంటుందని అంటున్నారు.

విజయావకాశాలు ఎక్కువ

చిన్న అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకునే నేర్పు సొట్టబుగ్గలు ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడి పనిచేసే స్వభావం వీరికి ఉంటుందని, అందువల్ల విద్య, ఉద్యోగం, వ్యాపారం వంటి రంగాల్లో మంచి విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటోంది.


ఆర్థిక వ్యవహారాల్లో తెలివి

సొట్టబుగ్గలు ఉన్నవారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారని, ఖర్చులు-పొదుపుల విషయంలో మంచి ప్రణాళికతో ముందుకు సాగుతారని విశ్వసిస్తారు. ఇతరుల కంటే భిన్నంగా ఆలోచించే స్వభావం కూడా వీరికి ఉంటుందని చెబుతారు.

కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి

అన్నీ అనుకూలంగానే ఉంటాయని కాదు. కొందరు తమ వ్యక్తిగత లేదా వైవాహిక జీవితంలో చిన్నచిన్న సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇతరులను సులభంగా నమ్మి మోసపోయే పరిస్థితులు కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి

ఆహారం తిన్న పళ్లెంలో చేతులు కడుక్కోకూడదట.. ఎందుకో తెలుసా?

Updated Date - Jun 24 , 2026 | 02:04 PM