పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన ఐశ్వర్యారాయ్.. రాచరికపు లుక్స్‌తో..
ABN , Publish Date - Sep 29 , 2026 | 01:45 PM
ప్రముఖ నటి ఐశ్వర్యా రాయ్ సోమవారం పారిస్ ఫ్యాషన్ వీక్ షోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటి ఐశ్వర్యా రాయ్ సోమవారం పారిస్ ఫ్యాషన్ వీక్ షోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఫ్లోయింగ్ డిజైన్ ఉన్న నలుపు రంగు గౌన్ ధరించి రాచరికం ఉట్టిపడేలా రన్‌వేపై నడుస్తూ ఆమె అక్కడున్న వారు చూపు తిప్పుకోనీయకుండా చేశారు.
ఎక్స్‌ప్రెస్ యువర్ వర్త్ థీమ్‌తో యారా షూమేకర్ తాజాగా కలెక్షన్‌లో దుస్తుల ధరించి ఆమె ఆ ఈవెంట్‌కు కొత్త ప్రత్యేకతను జోడించారు. సెలబ్రిటీ స్టైలిస్ట్ మోహిత్ రాయ్ ఈ దుస్తుల్ని డిజైన్ చేశారు. కొత్త లుక్‌తో మెరిసిపోతున్న ఐశ్వర్య ఫొటోలను కూడా మోహిత్ రాయ్ షేర్ చేశారు. కొత్తగా తమని తాము వ్యక్తీకరించాలన్న థీమ్‌కు అనుగుణంగా రాచరికపు దర్పం ఉట్టిపడేలా ఐశ్వర్యరాయ్ క్వీన్‌లా వెలిగిపోతున్నారని అన్నారు.
టూ పీస్ వెల్వెట్ రంగు గౌన్‌లో ఐశ్వర్యరాయ్‌ను చూసి అక్కడి వారు ఆశ్చార్యపోయారు. గౌన్‌లో 3డీ ఫ్రింజ్ ఎంబ్రాయిడరీ డిజైన్, నెక్‌లైన్‌తో ఉన్న దుస్తుల డిజైన్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ దుస్తులకు జోడీగా వెల్వెట్ రంగు కేప్, నెత్తిపై డైమండ్ క్రస్టెడ్ కిరీటం, రింగులు వంటివి రాచరిక లుక్‌ను ఇనుమడింప చేశాయి. నలుపు రంగు దుస్తులు వేసుకున్న ఆమె కాస్త ఎరుపు రంగు ఉన్న శిరోజాలతో కనిపించడం పూర్తి రాయల్ లుక్‌ను వచ్చిందని జనాలు ప్రశంసించారు. ఆమె హెయిర్ స్టైల్ తమను అమితంగా ఆకట్టుకుందని చెప్పారు.
క్రితం సారి జరిగిన ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్యారాయ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన దుస్తుల్లో జనాలను మెప్పించిన విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా ఆమె లారియాల్ పారిస్ ఫ్యాషన్ వీక్‌కు హాజరవుతూ భారతీయ అందానికి చిహ్నంగా నిలుస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
డాక్టర్ కంటే ముందు గూగుల్.. అనారోగ్యంగా అనిపిస్తే మొదట ఏఐని సంప్రదిస్తున్న ప్రజలు
అజంతా, ఎల్లోరా గుహలు చూడాలనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీ