Share News

నేడు భారత్‌కు జిన్‌పింగ్‌

ABN , Publish Date - Sep 12 , 2026 | 06:10 AM

దీర్ఘ విరామం తర్వాత చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ భారత్‌కు వస్తున్నారు. మనదేశం ఆతిథ్యం ఇస్తున్న బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు శనివారం ఆయన ఢిల్లీకి చేరుకుంటారు.

నేడు భారత్‌కు జిన్‌పింగ్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: దీర్ఘ విరామం తర్వాత చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ భారత్‌కు వస్తున్నారు. మనదేశం ఆతిథ్యం ఇస్తున్న బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు శనివారం ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. రెండు రోజుల సదస్సు సందర్భంగా భారత్‌, చైనా అధినేతలు సమావేశమయ్యే అవకాశం ఉంది. జిన్‌పింగ్‌ చివరిగా 2019లో భారత్‌లో పర్యటించారు. అనంతర పరిణామాలతో ఇరుదేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. 2020లో గాల్వాన్‌ లోయలో భారత, చైనా సైనికులు పరస్పరం ఘర్షణకు దిగారు. ఆ తర్వాత నుంచి దౌత్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తూ వచ్చాయి. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొని, వాణిజ్య బంధం బలపడేలా ఇరుదేశాల సంబంధాల్లో కొత్త ఊపును జిన్‌పింగ్‌ పర్యటన తెస్తుందని భావిస్తున్నారు.

Updated Date - Sep 12 , 2026 | 06:12 AM