అలీ ఖమేనీ మరణం.. 7 వారాలు అవుతున్నా అంత్యక్రియలు ఎందుకు చేయటం లేదు?..
ABN , Publish Date - Apr 20 , 2026 | 11:23 AM
ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయి దాదాపు 7 వారాలు అవుతోంది. అయినా కూడా ఇరాన్ ఆయన అంత్యక్రియలు నిర్వహించలేదు. ఇంతవరకు అంత్యక్రియల కోసం స్థలాన్ని కూడా ఎంపిక చేయలేదు.
టెహ్రాన్, ఏప్రిల్ 20: అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. టెహ్రాన్‌తో పాటు 30 చోట్ల బాంబు దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయి దాదాపు 7 వారాలు అవుతోంది. అయినా కూడా ఇరాన్ ఆయన అంత్యక్రియలు నిర్వహించలేదు. ఇంతవరకు అంత్యక్రియల కోసం స్థలాన్ని కూడా ఎంపిక చేయలేదు. భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున.. భద్రతా కారణాల దృష్ట్యా, మార్చిలో జరగాల్సిన అలీ ఖమేనీ అధికారిక అంత్యక్రియలను ఇరాన్ వాయిదా వేస్తూ వస్తోంది.
సాధారణంగా ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం వెంటనే అంత్యక్రియలు జరగాలి. కానీ, యుద్ధం కారణంగా అంత్యక్రియలు చేయటం ఆలస్యమవుతోంది. ‘ది ఫౌండేషన్ ఫర్ ది డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్’కు చెందిన సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ బెహ్నమ్ తలేబు అమెరికాకు చెందిన మీడియాతో మాట్లాడుతూ.. మొజ్తాబా ఖమేనీ నాయకత్వంలోని ఇరాన్ భయం గుప్పెట్లో మగ్గిపోతోందని ఆయన అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం ఉందన్న భయంతోనే అలీ ఖమేనీ అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించటం లేదని తెలిపారు.
కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా కూడా అలీ ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించడానికి ఇరాన్ ఆలోచిస్తోందన్నారు. మొజ్తాబా ఖమేనీ నాయకత్వం బలహీనంగా ఉందని, అలీ ఖమేనీ అంత్యక్రియల విషయంలో ముందడుగు వేయడానికి భయపడుతోందని చెప్పారు. కాగా, 1989లో ఆయతుల్లా రుహొల్లా ఖమేనీ అంతిమయాత్రలో లక్షల మంది జనం పాల్గొన్నారు. ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం ఉన్నందున రుహొల్లా ఖమేనీ అంతిమయాత్ర నిర్వహించినట్లుగా అలీ ఖమేనీ అంతిమయాత్ర నిర్వహించడానికి మొజ్తాబా ఖమేనీ నాయకత్వం భయపడుతోంది.
ఇవి కూడా చదవండి
ఏపీ వ్యాప్తంగా ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు
ఓటమి అనంతరం లఖ్‌నవూ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు