‘టార్గెట్’ యైుర్ నెతన్యాహూ!
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:49 AM
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ తరఫున పోరాటం చేయకుండా మియామీలో నివసిస్తున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కుమారుడు యైుర్...
ఇజ్రాయెల్ ప్రధాని కుమారుడిని అపహరించి, దాడిచేసే అవకాశం
వైట్ హౌస్ మాజీ అధికారి హెచ్చరిక
వాషింగ్టన్, మార్చి 3: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ తరఫున పోరాటం చేయకుండా మియామీలో నివసిస్తున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కుమారుడు యైుర్ నెతన్యాహూ ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్ష భవనం మాజీ అధికారి హోవర్డ్ స్టాఫర్ హెచ్చరించారు. యైుర్ వ్యవహార శైలిపై ఆగ్రహంతో ఉన్న కొందరు ఆయనను లక్ష్యంగా చేసుకుంటారని, అపహరించి, దాడి చేసే అవకాశముందని తెలిపారు. ఇతర పౌరుల మాదిరిగా ఐడీఎ్‌ఫలో యైుర్ తన పేరును ఎందుకు నమోదు చేసుకోలేదని ప్రశ్నించారు. నెతన్యాహూ కుమారుడిపై ఇజ్రాయెల్ సైన్యం కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ‘టైమ్స్ ఇన్ లండన్’ పేర్కొంది. ‘‘దేశం కోసం మేమిక్కడ ముందుండి పోరాడుతుంటే.. యైుర్ మాత్రం తన కుటుంబంతో కలిసి మియామీ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు.’’ అని ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల్లోని ఓ సైనికుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు మీడియా పేర్కొంది. ఇక, అమెరికాకు చెందిన ‘డైలీ ఎక్స్‌ప్రెస్’ కూడా ఇజ్రాయెల్ సైనికులు అసంతృప్తిలో ఉన్నారని తెలిపింది. ‘‘ప్రధాన మంత్రి కుమారుడిగా ఇజ్రాయెల్‌ను పరిరక్షించుకునే బాధ్యత ఉంది. అలాంటిది యైుర్ అమెరికాలో తిష్ఠవేయడం అవివేకం’’ అని స్టాఫర్ వ్యాఖ్యానించారు. .