యుద్ధానికి అమెరికా సెనేట్ ఆమోదం
ABN , Publish Date - Mar 06 , 2026 | 04:12 AM
ఇరాన్‌పై చేస్తున్న యుద్ధాన్ని నిలిపివేయాలంటూ కొందరు సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా సెనేట్ (ఎగువసభ) గురువారం తిరస్కరించింది.
నిలిపివేయాలన్న తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు
వాషింగ్టన్, మార్చి 5: ఇరాన్‌పై చేస్తున్న యుద్ధాన్ని నిలిపివేయాలంటూ కొందరు సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా సెనేట్ (ఎగువసభ) గురువారం తిరస్కరించింది. తీర్మానానికి అనుకూలంగా 47 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 53 ఓట్లు వచ్చాయి. ‘యుద్ధ అధికారాల తీర్మానం’ పేరుతో కూడిన ఈ తీర్మానాన్ని ప్రతిపక్ష డెమోక్రాటిక్ సెనేటర్ టిమ్ కైనే, అధికారపక్ష సెనేటర్ రాండ్ పాల్ సంయుక్తంగా ప్రవేశపెట్టటం విశేషం. ఓటింగ్ పార్టీల వారీగానే జరిగినప్పటికీ.. క్రాస్ ఓటింగ్ కూడా జరిగింది. డెమోక్రటిక్ సెనేటర్ జాన్ ఫెటర్మెన్ వ్యతిరేకంగా ఓటు వేశారు. తీర్మానం వీగిపోవటంతో.. ఇరాన్‌పై యుద్ధానికి సంబంధించి అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయానికి అమెరికా చట్టసభ మద్దతు ఇచ్చినట్లయ్యింది.