పాక్‌లోని ఎంబసీలు వదిలి అమెరికా వచ్చేయండి..
ABN , Publish Date - Mar 05 , 2026 | 05:38 AM
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణానంతరం పాకిస్థాన్‌లోని తమ ఎంబసీలపై దాడులు జరిగిన నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది.
వాషింగ్టన్: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణానంతరం పాకిస్థాన్‌లోని తమ ఎంబసీలపై దాడులు జరిగిన నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. పాకిస్థాన్‌లోని కరాచీ, లాహోర్‌లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో అత్యవసరం కానీ సిబ్బంది అంతా తమ కుటుంబసభ్యులతో కలిసి వెంటనే స్వదేశానికి వచ్చేయాలని బుధవారం ఆదేశించింది. ఇస్లామాబాద్‌లోని అమెరికా ఎంబసీ విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, సౌదీ అరేబియా, సైప్రస్, ఒమన్‌లోని ఎంబసీల్లోని సిబ్బంది స్వచ్ఛందంగా స్వదేశానికి తిరిగి వచ్చేందుకు అమెరికా అనుమతించింది.