అమెరికా ‘ప్రళయ కాల’ అణుక్షిపణి పరీక్ష
ABN , Publish Date - Mar 06 , 2026 | 03:59 AM
ఇరాన్‌తో యుద్ధం తీవ్రమవుతున్న సమయంలో అణు బాంబులను తీసుకెళ్లగలిగే ఖండాంతర క్షిపణిని అమెరికా విజయవంతంగా పరీక్షించింది.
హిరోషిమా బాంబు కన్నా 20 రెట్లు అధికంగల బాంబును తీసుకెళ్లే సామర్థ్యం
వాషింగ్టన్, మార్చి 5: ఇరాన్‌తో యుద్ధం తీవ్రమవుతున్న సమయంలో అణు బాంబులను తీసుకెళ్లగలిగే ఖండాంతర క్షిపణిని అమెరికా విజయవంతంగా పరీక్షించింది. ‘ప్రళయ కాల అంతిమ దినం (డూమ్స్ డే)’ అన్న మారు పేరు ఉన్న ‘మైన్యూట్‌మ్యాన్-3’ అనే ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ (ఐసీబీఎం)ను ప్రయోగించి చూసింది. హిరోషిమాలో ప్రయోగించిన అణుబాంబు కన్నా 20 రెట్లు అధిక సామర్థ్యంగల అణు బాంబును ఇది తీసుకెళ్లగలుగుతుంది. కాలిఫోర్నియోలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి మంగళవారం రాత్రి ఈ అణు క్షిపణిని ప్రయోగించింది. ‘జీటీ-225 టెస్ట్ వెహికల్’ అన్న పేరుతో ఎయిర్‌ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ ఈ ప్రయోగానికి ఆధ్వర్యం వహించింది. ఏకకాలంలో రెండు బాంబులను తీసుకెళ్లగలిగే విధంగా దీన్ని ప్రయోగించింది. ఎప్పటి నుంచో జరుగుతున్న రొటీన్ పరీక్షల్లో భాగంగా ఈ క్షిపణిని ప్రయోగించామని, ప్రస్తుత యుద్ధంతో సంబంధంలేదని అధికారులు తెలిపారు. వేల కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహా స ముద్రంలోని మార్షల్ ఐలాండ్‌లోఉన్న లక్ష్యాన్ని గురిచూసి కొట్టినట్టు పేర్కొన్నారు. గంటకు 15,000 మైళ్ల వేగంతో వెళ్లే ఈ క్షిపణి సుమారు 6,000 మైళ్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఽధ్వని కన్నా వేగంతో ఖండాలను దాటి నిమిషాల వ్యవధిలోనే భూగోళంపైనున్న ఎలాంటి లక్ష్యాన్నయినా గురిచూసి కొట్టే అవకాశంఉంది. దశాబ్దాలు గా 300కుపైగా ఇలాంటి ప్రయోగాలను చేసినట్టు అమెరి కా స్పేస్ ఫోర్స్ తెలిపింది. అమెరికాకు ఉన్న ఖండాంతర క్షిపణుల్లో ఇదే అత్యంత విధ్వంసకరమైనదని భావిస్తున్నారు.