Share News

463 కి.మీ. దూరంలోని లక్ష్యాన్నీ ఛేదిస్తుంది!

ABN , Publish Date - Aug 26 , 2026 | 06:46 AM

అత్యంత శక్తిమంతమైన, సుదూర లక్ష్యాలను ఛేదించగల క్షిపణి ‘ఏఐఎం-424 మాలి్‌స’ను అమెరికా నేవీ తాజాగా ఆవిష్కరించింది. ఈ అత్యాధునిక లాంగ్‌ రేంజ్‌ ఎయిర్‌-టు-ఎయిర్‌ మిస్సైల్‌...

463 కి.మీ. దూరంలోని లక్ష్యాన్నీ ఛేదిస్తుంది!

  • అత్యాధునిక ‘ఏఐఎం-424 మాలీస్’

  • క్షిపణిని ఆవిష్కరించిన అమెరికా

వాషింగ్టన్‌, ఆగస్టు 25: అత్యంత శక్తిమంతమైన, సుదూర లక్ష్యాలను ఛేదించగల క్షిపణి ‘ఏఐఎం-424 మాలీస్’ను అమెరికా నేవీ తాజాగా ఆవిష్కరించింది. ఈ అత్యాధునిక లాంగ్‌ రేంజ్‌ ఎయిర్‌-టు-ఎయిర్‌ మిస్సైల్‌ ఏకంగా 463 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల యుద్ధ విమానాలు, డ్రోన్లను అత్యంత కచ్చితత్వంతో కూల్చివేయగలదని అమెరికా చెబుతోంది. ఈ క్షిపణిని ప్రముఖ రక్షణ రంగ సంస్థ ‘రేథియాన్‌’తో కలిసి అమెరికా నౌకాదళం అభివృద్ధి చేసింది. దాదాపు 680 కేజీల బరువు, 13.5 అడుగుల పొడవుతో ఇది రూపుదిద్దుకుంది. ‘ఎఫ్‌-35సీ’ స్టెల్త్‌ ఫైటర్‌ జెట్ల లోపలి భాగంలో అమరేలా దీని బాడీని ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. దీనివల్ల యుద్ధ విమానం రాడార్‌కు దొరకకుండా ప్రయాణించే వ్యూహాత్మక ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం ‘ఎఫ్‌/ఏ-18ఈ’ సూపర్‌ హార్నెట్‌ యుద్ధ విమానాల్లో కూడా వీటిని అమర్చేందుకు పరీక్షలు జరుపుతున్నారు.

Updated Date - Aug 26 , 2026 | 06:57 AM