పరస్పర దాడులు ఉధృతం!
ABN , Publish Date - Jul 10 , 2026 | 05:52 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు ఉధృతమవుతున్నాయి. గత రెండు రోజుల్లో అమెరికా దాడుల్లో ఇరాన్‌లో...
ఇరాన్ మౌలిక సదుపాయాలపై అమెరికా టార్గెట్
ఇరాన్‌లో 2 రోజుల్లో 14 మంది మృతి
బహ్రెయిన్, కువైట్, ఖతార్‌లలోని అమెరికా స్థావరాలపైకి ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు
వాషింగ్టన్/దుబాయ్/న్యూఢిల్లీ, జూలై 9: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు ఉధృతమవుతున్నాయి. గత రెండు రోజుల్లో అమెరికా దాడుల్లో ఇరాన్‌లో 14 మంది మృతిచెందారని, 78 మంది గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. గురువారం తెల్లవారుజామున ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై అమెరికా వైమానిక దళం క్షిపణులు, బాంబులు వేసింది. హోర్ముజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ తీర ప్రాంత పట్టణాలపై, పలు కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేసింది. కీలకమైన చబహార్ పోర్టు, ఇరాన్‌లోని ఏకైక అణు విద్యుత్ కేంద్రం బుషెహర్ ప్లాంటుపై అమెరికా క్షిపణులు వేసిందని ఇరాన్‌కు చెందిన అల్ మెహర్ వార్తా సంస్థ వెల్లడించింది. అణు ప్లాంటు ఆవరణలోని ఒక భవనం దెబ్బతిన్నదని.. రియాక్టర్ ఉన్న ప్రధాన భవనానికి ఎలాంటి నష్టం జరగలేదని, అణుధార్మికత (రేడియేషన్) ఏదీ వెలువడటం లేదని అధికారులు తెలిపారని పేర్కొంది. గొలెస్తాన్ ప్రావిన్స్‌లో ఒక రైల్వే బ్రిడ్జిని, ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న మషాద్ నగరానికి వెళ్లే మార్గంలోని రెండు రోడ్డు వంతెనలు అమెరికా వైమానిక దాడుల్లో ధ్వంసమైనట్టు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) వెల్లడించింది. కాగా, ఇరాన్‌లో 90 లక్ష్యాలపై దాడులు చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.
దాడులు ఉధృతం చేసిన ఇరాన్..
బహ్రెయిన్, కువైట్, ఖతార్‌తోపాటు జోర్డాన్ వైపు కూడా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. గురువారం బహ్రెయిన్‌లో ప్రజలను హెచ్చరిస్తూ పలుమార్లు సైరన్లు మోగాయి. తమ వైపు వచ్చిన పలు ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను కూల్చేశామని ఆ దేశ అధికారులు తెలిపారు. ఇక గురువారం తమవైపు దూసుకొచ్చిన పది డ్రోన్లు, మూడు బాలిస్టిక్ క్షిపణులు, ఒక క్రూయిజ్ క్షిపణిని గగనతల రక్షణ వ్యవస్థలతో అడ్డుకున్నామని కువైట్ ప్రకటించింది. వాటి శకలాలు పడటంతో పలుచోట్ల పేలుళ్లు జరిగాయని, ఒకరు గాయపడ్డారని తెలిపింది. ఇక
ఇరాన్ హిట్‌లి్‌స్టలో నాపేరే మొదటిది: ట్రంప్
తనను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ తరచూ హెచ్చరిస్తోందని, ఇరాన్ చంపేయాలనుకుంటున్న వారి హిట్‌లిస్ట్ జాబితాలో తనపేరే మొదటిదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. తుర్కియే నుంచి తిరిగి వెళుతూ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
భారత్-పాక్ యుద్ధంలో 11 యుద్ధ విమానాలు కూలాయి
గత ఏడాది జరిగిన భారత్, పాక్ యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. ‘‘భారత్-పాక్ యుద్ధం సహా ఎనిమిది యుద్ధాలను ఆపిన నాకు నోబెల్ బహుమతి పొందే అర్హత ఉంది. భారత్-పాక్ యుద్ధంలో అణ్వస్త్ర దాడుల వరకూ పరిస్థితి వెళ్లింది. 11యుద్ధ విమానాలు కూలిపోయాయి. నేను జోక్యం చేసుకుని యు ద్ధాన్ని ఆపాను’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఏ దేశానికి చెందిన యుద్ధ విమానాలు కూలిపోయాయన్న ప్రస్తావనేదీ చేయలేదు.
ఈ వార్తలనూ చదవండి:
రోజంతా నిలకడగా రాణించి, చివరికి లాభాల్లోనే ముగిసిన సూచీలు
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..