చైనా రోబోటిక్ పరిశ్రమపై అమెరికా పిడుగు..!
ABN , Publish Date - Jul 30 , 2026 | 06:22 AM
గ్లోబల్ మార్కెట్‌లో 85ు వాటాతో చైనా రోబోటిక్స్ పరిశ్రమ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాను దారుణంగా దెబ్బతీసేలా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది...
విదేశీ రోబోలు, పవర్ ఇన్వర్టర్ల దిగుమతిపై నిషేధం
హాంకాంగ్, జూలై 29: గ్లోబల్ మార్కెట్‌లో 85ు వాటాతో చైనా రోబోటిక్స్ పరిశ్రమ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాను దారుణంగా దెబ్బతీసేలా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రత, సైబర్ సెక్యూరిటీ వంటి కారణాలు చూపుతూ విదేశాల్లో కొత్తగా తయారయ్యే హ్యూమనాయిడ్ రోబోలు, నాలుగు కాళ్ల రోబోలు, పవర్ ఇన్వర్టర్ల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) మంగళవారం వెల్లడించింది. ప్రపంచ మార్కెట్‌లో చైనా రోబోటిక్ పరిశ్రమల ఆధిపత్యాన్ని దెబ్బతీయడమే అమెరికా ఉద్దేశమని సాంకేతిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, అమెరికా చర్యను చైనా తీవ్రంగా తప్పుబట్టింది. చైనా కంపెనీలను అణచివేసేందుకు అమెరికా ‘జాతీయ భద్రత’ అనే అంశాన్ని వాడుకుంటోందని ఆరోపించింది. చైనా వ్యాపార సంస్థల చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామంది.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్
ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్