Share News

జీవితాన్ని మార్చేసిన ఇండియా టూర్.. విదేశీ మహిళ మెదడులో 38 పురుగులు

ABN , Publish Date - Jul 02 , 2026 | 04:16 PM

భారత పర్యటన ఓ విదేశీ మహిళ జీవితంలో దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది. భారత్‌లో పర్యటించి వెళ్లిన తర్వాత ఆమె శరీరంలో నులిపురుగుల సమస్య మొదలైంది. ఆఖరికి ఆమె మెదడులోకి కూడా నులిపురుగులు చేరాయి.

జీవితాన్ని మార్చేసిన ఇండియా టూర్.. విదేశీ మహిళ మెదడులో 38 పురుగులు
Neurocysticercosis

ఇంటర్‌నెట్ డెస్క్: భారత పర్యటన ఓ విదేశీ మహిళ జీవితంలో దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది. భారత్‌లో పర్యటించి వెళ్లిన తర్వాత ఆమె శరీరంలో నులిపురుగుల సమస్య మొదలైంది. ఆఖరికి ఆమె మెదడులోకి కూడా నులిపురుగులు చేరాయి. దీంతో ఆ మహిళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ వివరాల్లోకి వెళితే.. యూకేకు చెందిన లోవ్రీ డెన్‌మ్యాన్ అనే 42 ఏళ్ల మహిళ 2007లో మూడు నెలల పాటు భారత్‌లో పర్యటించింది. ఈ నేపథ్యంలోనే ఆమె అడవి పంది మాంసం తినింది. పర్యటన ముగిసిన తర్వాత ఆమె తన దేశానికి వెళ్లిపోయింది.
woman-2.jpg


దాదాపు మూడేళ్ల తర్వాత 2010లో ఆమె యూకేలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ టాయిలెట్‌కు వెళ్లినపుడు నులిపురుగులు పడటం ఆమె గుర్తించింది. వెంటనే టూల్ టెస్టులు చేయించుకుంది. ఆ పరీక్షల్లో ఎలాంటి సమస్యా లేదని రిపోర్టులు వచ్చాయి. సరిగ్గా ఏడాది తర్వాత ఆమెకు తరచుగా తలనొప్పి రావటం మొదలైంది. 2011లో మొదటి సారి ఆమెకు పక్షవాతం వచ్చింది. దీంతో ఆమె ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి డాక్టర్లు ఆమెకు సీఏటీ స్కాన్, ఎమ్‌ఆర్ఐ చేశారు. ఆమె మెదడులో 38 నులిపురుగులు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ విషయాన్ని లోవ్రీ డెన్‌మ్యాన్‌కు చెప్పారు. దాదాపు రెండు వారాల పాటు ఆమె ఆస్పత్రిలో ఉండి ఆ నులిపురుగుల సమస్యకు చికిత్స తీసుకుంది.


అంతా ఓకే అనుకున్న తర్వాత ఇంటికి వచ్చేసింది. సాధారణ జీవితం గడపసాగింది. కొన్నేళ్లు ఇట్టే గడిచిపోయాయి. తర్వాత మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. లోవ్రీ ఓ రోజు ఆఫీస్‌లో ఉండగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. మెదడులో తీవ్రమైన వాపు ఉన్నట్లు గుర్తించారు. రెండు సార్లు ఆమెకు సర్జరీ చేశారు. నులిపురుగుల దెబ్బ నుంచి ఆమె కోలుకోవడానికి ఏకంగా 10 సంవత్సరాలు పట్టింది. 2017 నుంచి ఆమెకు పక్షవాతం రావటం లేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. డాక్టర్ల సూచన మేరకు ఆమె యాంటీ-సీజర్ మందులు వాడుతోంది.
woman.jpg


ఇవి కూడా చదవండి

టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు

కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది

Updated Date - Jul 02 , 2026 | 06:24 PM