కెనడాలో ఇద్దరు భారతీయ విద్యార్థుల దుర్మరణం
ABN , Publish Date - Sep 22 , 2026 | 03:52 AM
కెనడాలో శిక్షణ పొందుతున్న విమానం ప్రమాదానికి గురికావడంతో ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించారు.
టొరాంటో, సెప్టెంబరు 21: కెనడాలో శిక్షణ పొందుతున్న విమానం ప్రమాదానికి గురికావడంతో ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించారు. తమిళనాడుకు చెందిన మనోజ్ శివకుమార్, పుదుచ్చేరికి చెందిన శ్రీశరణ్ తిరుజ్ఞానసంబంధనం మృతి చెందారని ఆదివారం వాంకోవర్‌లోని భారతీయ కాన్సులేట్ జనరల్ కార్యాలయం తెలిపింది.