నన్ను చంపేస్తే.. ఇరాన్ సర్వనాశనమే: ట్రంప్
ABN , Publish Date - Jul 11 , 2026 | 05:45 AM
తాను ఇరాన్ ‘కిల్‌లిస్ట్’లో మొదటిస్థానంలో ఉన్నానని.. ఒకవేళ వాళ్లు తనను చంపేస్తే ఇరాన్‌ను సర్వనాశనం చేయాలని ముందే ఆదేశాలు ఇచ్చానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్...
దీనిపై ముందే ఆదేశాలిచ్చా: ట్రంప్
వాషింగ్టన్, జూలై 10: తాను ఇరాన్ ‘కిల్‌లిస్ట్’లో మొదటిస్థానంలో ఉన్నానని.. ఒకవేళ వాళ్లు తనను చంపేస్తే ఇరాన్‌ను సర్వనాశనం చేయాలని ముందే ఆదేశాలు ఇచ్చానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. తాజాగా న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ‘‘నాకేదైనా జరిగితే ఇరాన్‌పై కనీవినీ ఎరుగనంత స్థాయిలో బాంబులు వేయాలని ముందే ఆదేశాలు ఇచ్చాను’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇప్పటికిప్పుడు తనపై హత్యాయత్నం జరగబోతోందన్న నిఘా సమాచారమేదీ లేదని చెప్పారు. ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా.. ట్రంప్‌ను చంపాలంటూ బ్యానర్లు కనిపించాయి. పలువురు ఐఆర్‌జీసీ కమాండర్లు ఖమేనీని చంపిన ట్రంప్‌కు అదే గతి పడుతుందనీ హెచ్చరికలు కూడా చేశారు. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్